ఇప్పటికే భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉండగా నేటికీ అది 173 కి చేరుకుంది. అయితే అందరిని విస్మయ పరిచే రీతిలో బృహన్ ముంబై కార్పొరేషన్ వారు ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. దాదాపు 26 వేల మంది భారతీయులు నేటి నుండి నెల 31 తారీఖు లోపల గల్ఫ్ దేశాలు అనగా యూఏఈ, కువైట్, ఖతార్ మరియు ఒమన్ దేశాల నుండి ముంబైకు రానున్నారు.

 

ప్రస్తుతం భారతదేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువమంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 45 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా అందులో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. దాదాపు 23 విమానాల్లో ఆయా దేశాల నుండి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారి లెక్కల ప్రకారం దాదాపు 26,000 మంది సిటీ ఎయిర్పోర్టులో దిగుతారు. వారు దిగిన వెంటనే అక్కడే వారి యొక్క సమాచారాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటుంది. అలాగే అక్కడి నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కనీసం 14 రోజులు క్వారంటైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది.

 

ఇకపోతే ఇప్పటికే దుబాయ్ నుండి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు వస్తున్న 26,000 మందిని పాజిటివ్ గానే ముందుగా పరిగణిస్తూ…. ముంబై కార్పొరేషన్ వారు సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో రాబోతున్న వారందరికీ ప్రత్యేకంగా ఐసోలేషన్ గార్డులను ఏర్పాటు చేసి మరియు వారికి పరీక్షలు జరిపే వారికి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

 

వచ్చిన వారందరినీ సెల్ఫ్ ఐసోలేట్ చేసి తర్వాత వారి రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించి పాజిటివ్ కేసులు వేరుపరిచి బయట ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎంతైనా ఒక్కసారిగా 26 వేల మంది కరోనా పాజిటివ్ అనుమానితులు దేశంలోకి వచ్చారు అంటే ఊహే భయంకరంగా ఉంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: