దాదాపు నాలుగు నెలల నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశం ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా వైరస్ అన్ని దేశాలకు విస్తరించింది. ఊహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఎక్కడిక్కడ ప్రజలు రోడ్ల మీదకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు అన్ని దేశాలు షట్ డౌన్ ని ప్రకటించాయి. అన్ని అంతర్జాతీయ విమానాలు ఈ కరోనా దెబ్బకు రద్దు అయ్యాయి. పటిష్ట ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాలు కూడా కరోనా తీవ్రత దెబ్బకు కుప్ప కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వాస్తవం. 

 

ఎన్ని విధాలుగా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నా సరే వైరస్ వ్యాప్తి అనేది ఆగడం లేదు. భారత్ కి కరోనా వచ్చే అవకాశం లేదని భావించారు. అయినా సరే కరోనా మాత్రం ఆగలేదు అనే చెప్పాలి. ప్రస్తుత౦ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కరోనా దెబ్బకు హై అలెర్ట్ ప్రకటించాయి. కఠిన చర్యలు తీసుకుంటూ వ్యాధి ఇంకా విస్తరించకుండా ఉండేందుకు గాను జాగ్రత్తలు పడుతున్నాయి. అయినా సరే వ్యాధి మాత్రం వేగంగా విస్తరిస్తూ వస్తుంది. ప్రస్తుతం భారత్ సహా కొన్ని దేశాలు తమ ప్రజలను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా కర్ఫ్యూ విధించారు. 

 

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ని కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించారు. తెలంగాణాలో 14 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు దీని వేగ౦ చూస్తుంటే ఎం జరుగుతుందో అనే భయ౦ అందరిలోనూ నెలకొంది. ప్రపంచ౦ అంతరించి పోతుందా అనే భయ౦ కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. చైనాలో కట్టడి అయిన ఈ వైరస్ ఇతర దేశాల్లో మాత్రం ఆగే పరిస్థితి కనపడటం లేదు. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: