అవును కరోనా వైరస్... ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నెత్తిన కూర్చుంది. ఏ ఒక్క వ్యాపారం కూడా సరిగా జరిగే పరిస్థితి కనపడటం లేదు. ఇడ్లి నుంచి విమాన౦ వరకు సైకిల్ నుంచి రైలు వరకు ఏ ఒక్క వ్యాపారం కూడా ప్రశాంతం గా జరిగే అవకాశాలు కనపడటం లేదు. కరోనా వైరస్ దెబ్బకు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోవడానికి ప్రజలు ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి దేశంలో లేదు అంటే ఏ స్థాయిలో కరోనాకు భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అన్ని దేశాల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. 

 

బయటకు రావాలి అంటేనే జనం భయపడుతున్నారు. దీనితో అన్ని వ్యాపారాలు మూత పడే పరిస్థితులు కనపడుతున్నాయి. కీలక దేశాల మధ్య వాణిజ్య౦ ఆగిపోయింది. విదేశీ ప్రయాణాలు లేవు, అలాగే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యవసర వస్తువులను కూడా నిలిపి వేసారు. ఇక మన దేశంలో సినిమా, క్రికెట్ ఇలాంటి వాటి మీద కరోనా ప్రభావం గట్టిగా పడింది. ఈ రెండు రంగాలు కూడా దీని దెబ్బకు కుదేలు అయిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక మన దేశంలో విస్తృతంగా ఉండే చిన్న చిన్న వ్యాపారాలు కూడా కరోనా దెబ్బకు మూత పడ్డాయి. 

 

అదే విధంగా మన దేశంలో ఉండే కొన్ని కీలక వ్యాపార, ఉద్యోగ రంగాలు ఇప్పుడు ఉద్యోగులు రాక అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. ఒక మనిషి మరో మనిషి తో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి నేడు ఉందీ అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత ఆర్ధిక వ్యవస్థ నేడు కష్టాల్లో ఉంది. ఈ తరుణంలో వచ్చిన కరోనా, పర్యాటక రంగం సహా అనేక రంగాలను ఇబ్బంది పెట్టింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు మెరుగు అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: