నిర్భయ దోషులకు ఉరి ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీసిన విషయం తెలిసిందే. 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని న్యూఢిల్లీలో క‌దులుత‌న్న‌ బ‌స్సులో జరిగిన సామూహిక అత్యాచారం హత్య కేసులో ఆ యువతిని ఆరుగురు మృగాళ్లు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ రోజు ఆరుగురు నిందితులు పెట్టిన చిత్రహింసలకు ఆ మహిళ ఎంత విల‌విల్లాడిందో తలుచుకుండేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈరోజు ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడడంతో దేశం మొత్తం సంబ‌రాల్లో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఉఊరికి ముందు కూడా ఆఖరి ప్రయత్నంగా వీరిని విడిపించేందుకు దోషుల తరపున వాదిస్తున్న లాయర్ ఏపీ. సింగ్ మరోసారి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ధ‌ర్మాస‌నం తలుపు తట్టాడు.



అయితే దీనిపై ధర్మాసనం ఈ రోజు ఉదయం రెండు గంటల ముఫ్ఫై నిమిషాలకు అత్యవసరంగా విచారణ చేపట్టింది. అయితే ఏపీ సింగ్ చెప్పిన‌ ఏ విషయాన్ని కూడా అంగీకరించని కోర్టు చివరకు ఉరిశిక్ష ఖరారు చేయాలని చెప్పింది. ఇక ఉరిశిక్ష అమలు జరిగిన నలుగురు దోషులు కూడా చాలా వింత‌గా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు తెలుస్తోంది. విన‌య్ శ‌ర్మ‌ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. ఇక‌ పవన్ గుప్తా జైలు అధికారులను దూషించినట్టు సమాచారం.



ఇక ఈ న‌లుగురిలో ముఖేష్ సింగ్‌, అక్ష‌య్ ఠాగూర్ మాత్ర‌మే రాత్రి భోజ‌నం చేశారు. ఇక ముఖేష్ సింగ్ కుటుంబ స‌భ్యులు మాత్రం అత‌డిని కలిసేందుకు నైట్ జైలుకు వ‌చ్చారు. ఇక ఉద‌యం 4 గంట‌ల‌కు త‌లారీ ప‌వ‌న్ జ‌ల్లాద్ జైలు అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ముందుగా వీరిని స్నానం చేయ‌మ‌ని కోరారు. త‌ర్వాత అల్పాహారం సేవించ‌మ‌ని కోరినా నిరాక‌రించారు. ఇక గ‌త రాత్రి ఈ న‌లుగురిని వేర్వేరు రూముల్లో ఉంచారు. మిగిలిన ఖైదీలు కూడా ఉద‌య‌మే లేచి ఏం జ‌రుగుతుందా ? అని ఆస‌క్తితో వెయిట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: