ఎప్పుడో 2012 డిసెంబర్ లో జరిగింది నిర్భయ అత్యాచారం. ఆ తర్వాత ఆరు నెలలకే వాళ్లకు శిక్ష విధించింది అప్పటి ఫాస్ట్రాక్ కోర్ట్. అక్కడి నుంచి నిందితులు సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్ట్ కి వెళ్ళారు, పాటియాలా హౌస్ కోర్ట్ కి వెళ్ళారు. అయినా సరే ఉరి శిక్ష మాత్రం ఆగలేదు. ఎన్నో వాదనలను, ఎన్నో పిటీషన్ లు, ఎన్నో వాయిదాలు, ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో విచారణలు, ఎందరో అధికారులు. కింది స్థాయి కోర్ట్ విధించిన శిక్షను పై కోర్ట్ లు కూడా సమర్ధించాయి. అన్ని కోర్ట్ లు దాన్ని సమర్ధిస్తూ ఉరి తీయాల్సిందే అని స్పష్టంగా చెప్పాయి. 

 

నిందితులు ఆ పిటీషన్, ఈ పిటీషన్ అంటూ ఒకడి తర్వాత మరొకడు కోర్ట్ కి వెళ్ళారు. వాళ్ళ తరుపు లాయర్ ఏపీ సింగ్ కూడా ఇదే చేసాడు. మాపై రేప్ జరిగింది అని అన్నారు. ఒకడు తల బాదుకునే ప్రయత్నం చేసాడు. మరొకడు నా మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పాడు, అయినా సరే శిక్ష ఆగలేదు. వాళ్లకు కల్పించాల్సిన న్యాయపరమైన హక్కులను అన్నింటిని కూడా కోర్ట్ కల్పించింది. రాజ్యాంగం వారికి ఉన్న అవకాశాలను వాడుకోవడానికి అవకాశాలు కల్పించింది. అయినా సరే వాళ్ళను దోషులుగా కోర్ట్ లు ఖరారు చేసాయి. 

 

వాళ్ళ వాదనను కూడా కోర్ట్ వినే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేయలేదు. ఒకడు నేను చిన్న పిల్లాడిని అన్నాడు, మరొకడు నేను ఢిల్లీ లో లేను అని చెప్పాడు. అయినా సరే శిక్ష నుంచి ఏ కోణ౦లో కూడా దోషులు తప్పించుకోలేదు. ఎట్టకేలకు తీహార్ జైల్లో వారిని ఉరి తీసారు అధికారులు. దేశం వాళ్లకు చెప్పింది ఒక్కటే. మీరు తప్పు చేసారు శిక్ష పడింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది కోర్ట్. ఏది ఎలా ఉన్నా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: