ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో ఆశలు.. నిరాశల మధ్య నలిగిన నిర్భయ దోషుల చ‌రిత్ర ఈరోజు ఉదయంతో కాలగర్భంలో కలిసిపోయింది. ఇక‌పై నిర్భ‌య దోషుల‌ చరిత్ర అనేది చరిత్ర అనేది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా ముగిసింది. వీరికి ఉరి శిక్ష ప‌డ‌డంతో ఎప్ప‌ట‌కి అయినా న్యాయం గెలుస్తుంద‌న్న‌ది ఫ్రూవ్ అయ్యింది. అస‌లు ఎప్పుడో వీరికి ఉరి శిక్ష ప‌డాల్సి ఉంది. అయితే చ‌ట్టంలో ఉన్న లొసుగులు అన్ని ఉప‌యోగించుకుని వీరు ఇప్ప‌టి వ‌ర‌కు కాలం గ‌డుపుతూ వ‌చ్చారు.



ఈ న‌లుగురు దోషుల త‌ర‌పున కేసు వాదించిన న్యాయ‌వాది ఏపీ. సింగ్ చివ‌ర‌కు ఉరి శిక్ష ప‌డేందుకు కొన్ని గంట‌ల ముందు సైతం సుప్రీంకోర్టులో ప్ర‌త్యేకంగా వేసిన పిటిష‌న్‌తో ధ‌ర్మాస‌నం ఉద‌యం 2 . 30 గంట‌ల‌కు అత్య‌వ‌స‌రంగా తీర్పు వెలువ‌రించి న్యాయ‌వాది సింగ్ వాద‌న‌లు స‌మ‌ర్థ‌వంతంగా లేవ‌ని స్ప‌ష్టం చేసి వెంట‌నే ఉరి తీయాల‌ని ఆదేశించింది. ఇక ఉరి శిక్ష‌కు ముందు న‌లుగురు దోషుల్లో ఒక‌రైన విన‌య్ శ‌ర్మ త‌ల్లి అధికారుల‌ను చివ‌రి కోరిక‌గా ఓ కోరిక కోరింది.



చివ‌రి సారిగా త‌న కుమారుడికి పూరీ, స‌బ్జి, క‌చోరీ తినిపించాల‌ని ఉంద‌ని అధికారుల‌కు విన్న‌వించు కుంది. అయితే అధికారులు ఆమె కోరిక‌ను అంగీక‌రించారో ?  లేదో ?  మాత్రం తెలియ రాలేదు. ఇక ఉరి శిక్ష అమ‌లుకు ముందు గత రాత్రి నుంచి కాస్త తీవ్ర ఆవేద‌న‌తో ఇష్ట మొచ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించిన విన‌య్ శ‌ర్మ ఉరి కంభం ఎక్కేముందు భోరున విల‌పించిన‌ట్టు స‌మాచారం.



ఇదిలా ఉంటే అటు నిర్భ‌య త‌ల్లి త‌న ఎనిమిది సంవ‌త్స‌రాల పోరాటానికి త‌గిన న్యాయం జ‌రిగింద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఎట్ట‌కేల‌కు నిర్భ‌య దోషుల‌కు ఉరి శిక్ష ప‌డ‌డంతో త‌న కుమార్తె ఆత్మ‌కు శాంతి క‌లిగి న‌ట్ల‌య్యింద‌ని ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అటు నిర్భ‌య తండ్రి సైతం ఉరి శిక్ష‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: