మన దేశంలోకి కరోనా వైరస్ రెండో దశలోకి చేరుకుంటున్నదా ? వైద్య వర్గాలు కొన్ని రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే  అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైద్య వర్గాల సమాచారం ప్రకారం కరోనా వైరస్ నాలుగు దశలుంటాయి. మొదటి దశలో విదేశాలల్లో వైరస్ సోకిన వారి ద్వారా మనదేశంలోని వాళ్ళకి రావటం. రెండో దశ ఏమిటంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన వారి ద్వారా మనదేశంలో వ్యాపించటం. ప్రస్తుతం మనదేశంలో వైరస్ రెండో దశలోకి చేరుకున్నట్లు సమాచారం.

 

ఇక మూడు, నాలుగో దశలు చాలా భయంకరంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉందంటేనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయో అందరూ చూస్తున్నదే. ఈ దశను దాటి మూడో దశలోకి వైరస్ వ్యాప్తి ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా ? వైరస్ ను మూడో దశలోకి ప్రవేశిచనీయకూడదన్న పట్టుదలతోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి.

 

మూడో దశ ఏమిటంటే వైరస్ సోకిన వారు యధేచ్చగా ఆఫీసులకు, బహిరంగ ప్రాంతాల్లో తిరగటం, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవ్వటం ద్వారా అందరికీ అంటించటం. ఇదే గనుక జరిగితే వైరస్ ను అరికట్టటం ప్రభుత్వాల వల్ల సాధ్యంకాదు. అందుకనే వైరస్ ఉందనే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండమనేది. ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరొకరికి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ విషయం మీదే ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి.

 

ఇక నాలుగో దశ ఏమిటంటే వైరస్ వ్యాప్తిపై నియంత్రణ కోల్పోవటం. ఈ దశకు వస్తే మరణాలను ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలు నాలుగో దశకు చేరుకున్నాయి. అందుకనే ఆ దేశాల్లోని రోగులకు క్వారన్ టైన్లు, ఆసుపత్రులు సరిపోవటం లేదు. పైగా మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.  చైనాలో వైరస్ నాలుగో దశలో ఉండటం వల్లే మరణాలు వేలల్లో ఉన్నాయి. మూడు, నాలుగో దశలకు చేరుకుంటే  ఆరోగ్య వ్యవస్ధ కుప్ప కూలినట్లే అనుకోవాలి. అదృష్ట వశాత్తు మనదేశంలో రెండో దశలోనే ఉంది కాబట్టే మూడో దశకు రాకూడదని ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనికి జనాలు కూడా పూర్తిగా సహకరించాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: