నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలైన విషయం తెలిసిందే. గత ఏడేళ్ల నుంచి నిర్భయ కేసులో నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. అయితే ఏకంగా నిర్భయ దోషులకు వ్యవహరించిన తీరుపై చట్టాల పై ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోయేలా చేశారు. ఇక ఘటన జరిగి ఏడేళ్లు అవుతుండగా ఇప్పుడు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది .నిర్భయ  కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరు తమకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ కోర్టుల తీర్పులు అవహేళన చేస్తూ వచ్చారు. కానీ కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. 

 

 

 గత ఏడేళ్ల నుంచి నిర్భయ కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. నిన్న నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధిస్తూ పటియాల కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక దేశం చరిత్రలో మొదటి సారి నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జైలు అయినా తీహార్ జైలులో  నలుగురు నిందితులను ఉరితీసారు  అదికారులు. అయితే నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి  తీయడంతో దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తీహార్ జైలులో తరతరాలుగా తలారి గా పనిచేస్తూ వస్తున్న తలారి కుటుంబంలో ఒక్కరైనా పవన్ జలాద్  నలుగురు నిందితులను ఉరితీసారు. 

 

 

 అయితే నిర్భయ దోషులు ఉరి వల్ల తలారి పవన్ కు ఎంతో మేలు జరిగింది. గతంలో ఆయన నిర్భయ దోషులకు ఉరి వేస్తే జరిగే మేలు గురించి చెప్పుకొచ్చారు. తమ తాతల కాలం నుంచి తలారులుగా  పనిచేస్తున్నామని... ఒకప్పుడు ఒక వ్యక్తిని ఉరి తీస్తే రెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని... కానీ ప్రస్తుతం ఒక వ్యక్తిని ఉరి తీస్తే 25 వేల రూపాయలు ప్రభుత్వం తళారులకు అందజేస్తుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఉరి తీస్తే ఒక్కొక్కరికి  25 వేల చొప్పున లక్ష రూపాయల వరకు తనకు ప్రభుత్వం అందిస్తుందని... ఇక నిర్భయ దోషులకు ఉరి తీయడం ద్వారా వచ్చిన సొమ్ముతో తమ కూతురికి వివాహం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు తలారి పవన్ జలాద్ . ఇలా నిర్భయ నిందితులు చనిపోయి తలారికి  మేలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: