మోసం... మోసం... ఎక్కడ ఎలా చూసిన మన చుట్టుపక్కల కనిపించేలా, కనపడకుండా ఇలా అనేకరకాలుగా మనము రోజు మోసపోతుంటాము. ఇక్కడ విడ్డురం ఏమిటంటే చదువుకొని  వారికంటే చదువుకున్నవారు ఎక్కువగా మోసపోతుంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి బయట పడింది. ఇక వివరాలలోకి వెలితే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక యువతిని నమ్మించి కారులో కిడ్నాప్ చేసి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 

 


ఇలా చేసిన అంతర్రాష్ట్ర నేరస్థుడికి రంగారెడ్డి జిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్‌ కోర్టు అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించి నిందుతుడికి జీవితఖైదు విధించింది. అతడికి జైలు శిక్షతో పాటు రూ.90వేల జరిమానా కూడా విధించింది కోర్ట్. అలాగే బాధితురాలికి రూ.50,000 నష్టపరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉన్న కంకిపాడు మండలం దవులూరుకు చెందిన ఎ.రవిశేఖర్‌(48) వృత్తి రిత్యా వ్యవసాయం చేసుకొనే వాడు. కాకపోతే అతడి బుద్ది అడ్డదారి తొక్కడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. 

 

 


ఇలా చాలా మందిని మోసం చేసి మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నేరస్థుడిగా అతను మారాడు. నిజానికి అతని మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతడిపై ఏకంగా సుమారు 40 కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఒక కారును దొంగిలించిన రవిశేఖర్ దానితో తెలంగాణ రాష్ట్రములోకి వచ్చాడు. 2019 జులై 23న హైదరాబాద్ శివారులోని ఒక హోటల్ యజమానిని మాయమాటలతో నమ్మించి ఆయన కూతురికి ఉద్యోగం కలిపిస్తానని చెప్పి ఆ సదరు యువతి (21)ని కారులో ఎత్తుక వెళ్ళిపోయాడు.

 

 

 

ఆలా జరిగిన తర్వాత యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర శివారులోని హయత్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి గట్టి గాలింపు చేపట్టారు. ఆ నిందితుడు సదరు యువతిని కారులో కడప, కర్నూలు, గుంటూరు ఇలా అనేక ప్రాంతాల్లో యువతిని తిప్పుతూ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసాడు. చివరికి అతడి నుంచి ఎలాగోలాగ తప్పించుకున్న ఆమె బస్సులో హైదరాబాద్‌ చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. దీనితో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆ తర్వాత 2019 ఆగస్టు 3న హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ గేట్‌ వద్ద రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వారి స్టైల్ లో విచారించగా నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీనితో పోలీసులు అతడిపై నిర్భంద చట్టం (పీడీ యాక్ట్‌) విధించి కోర్టులో ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: