ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిని అమరావతి నుండి  తరలించ వద్దు అంటూ అమరావతి ప్రాంత రైతుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 3 రాజధానులు రాష్ట్రంలో అవసరమని... అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతామని అంటూ ప్రకటించినప్పటి నుంచి రాజధాని ప్రాంతంలోని రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజధాని తరలించే వద్దు అంటూ రైతులు నిరసన చేస్తూనే ఉన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన విడుదల చేసి నెలలు గడుస్తున్నా రాజధాని రైతులు మాత్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుండి రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదు అంటూ రైతులు చెబుతున్నారు. 

 

 

 అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వ్యాప్తి శరవేగంగా ఉన్న నేపథ్యంలో రైతులకు చిక్కులు వచ్చేలా  కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శిబిరాల్లో రైతులు రైతు కుటుంబీకులు అందరూ ఒకచోట గుమిగూడి ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందరూ ఒకచోట గుమిగూడి ఉంటే కరోనా  వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అమరావతి రైతులందరూ అయోమయంలో పడిపోయారు. కరోనా  వైరస్ వచ్చింది అని ఉద్యమాన్ని ఆపివేయాలా... లేక ఏం చేయాలి అనే దానిపై అయోమయంలో పడిపోయారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు. 

 

 

 ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిని తరలించే వద్దు అంటూ దాదాపు రెండు నెలల నుంచి అమరావతి రైతులు నిరసనలు చేస్తున్న శిబిరాలపై ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్  భారీగానే పడినట్లు తెలుస్తోంది. కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శిబిరాలు నిర్వహించి వద్దు అంటూ జిల్లా అధికారులు అమరావతి రైతులకు సూచించారు. దీంతో రేపటినుంచి శిబిరాలలో నిరసనను కొనసాగించాలా లేదా అనే దానిపై అమరావతి రైతులందరూ... శుక్రవారం నిరసన శిబిరాల్లో  ఎక్కడికక్కడ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలను తీసుకుని తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు అమరావతి రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: