సినిమా టైపు సాగింది ఈ వ్యవహారం. అయితే నిజంగా ప్రజలు ఎంతో కోపంతో ఎదురు చూసారు. వేస్తున్న ప్లాన్స్ కి , చెబుతున్న సాకులకి జనం సహనాన్ని ఎప్పుడో కోల్పోయారు. ఆ లాయరు మాత్రం శక్తిని మించే సాయం చేసాడు. ఎత్తుకి పై ఎత్తు వేసి ఆలా ఆలా ప్రాణాన్ని గట్టెక్కిస్తున్నాడు . ఏది ఏమైనా ఉరి పడనివ్వకుండా ఆపుతానని సవాల్ విసిరాడు ఏపీ. సింగ్.

 

 

సాటి లాయర్లు శిక్షించలేమా అని ప్రశ్నిస్తున్నా... తనని ఎవరు ఏమి చెయ్యలేరన్నట్టే  ముందుకి వెళ్ళాడు. ఒక ఆడ బిడ్డని రేప్ చేసినా చేతులు కట్టుకుని చూసిన దుస్థితి వచ్చింది . ఇంకేం ఉంది న్యాయం అంటూ అరిచినా రాలేదు నేటి వరకు. నేర స్వభావాన్ని చంపాలి కానీ నేరస్తుడిని కాదు అంటూ అనేకం చెప్పుకొచ్చాడు. ఒక లాయర్ గా ఆ కేసు నెగ్గించడానికి వీర ప్రయత్నం చేసాడు. 

 

 

కొద్ది క్షణాల్లో ఉరి అని అన్నారు. కానీ ఒక విచిత్రంలాగ హఠాత్తుగా ఢిల్లీలో వాదనలు దిగారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు... ఇలా ఆనేక ప్రయత్నాలు చేసారు. కానీ చివరికి అన్యాయం ఓడిపోయింది. ఎన్నాళ్ళ నుండో పోరాడుతున్న న్యాయం విజేతగా నిలిచింది. చివరకి ఎన్నో అబద్ధాలు, విడాకులు ఇలా ఎన్నో ఎత్తుగడలని వేయించాడు. కానీ న్యాయం ముందు ఆ పప్పులు ఏమి ఉడక లేదు.

 

ఇంకేం ఉంది సినిమా ముగిసిపోయింది. ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ కి ఈరోజు ఉదయాన్నే ఉరి శిక్ష పడింది. కేసు ఓడిపోయాడు ఏ.పి. సింగ్. ఆ నలుగురు దోషులకు శిక్ష పడింది. న్యాయ వృత్తి లో ఉన్న ఆ లాయరు అన్యాయాన్ని ఇంత కాలం వెనకేసుకొచ్చాడు. దోషులకు శిక్ష పడింది. ఆలస్యం అయినా న్యాయమే నెగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: