నేను పుట్టాను..ఈ లోకం ఏడ్చింది.. నేను నవ్వాను.. ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది.. అంటాడో సినీ హీరో.. కానీ ఇవి పాడుకోవడానికే బావుంటాయి. కానీ రియల్ లైఫ్ లో అస్సలు బావుండదు ఎందుకంటే.. మానవుడు సమూహజీవి. మానవజాతి ఆవిర్భావం నుంచి అందరూ గుంపులుగా జీవించారని చరిత్ర చెబుతోంది.

 

 

అసలు ఒక్క మానవుడే ఏంటి.. ప్రతిజీవీ తమ జాతితో మమేకమయ్యే జీవిస్తుంది. బారులు కట్టి ఆహార సముపార్జన చేసే చిట్టి చీమలను చూసే ఉంటారు. తినేవి కనిపిస్తే చాలు తోటి కాకులను కావు కావు మంటూ ఆహ్వానించే కాకులనూ చూసే ఉంటారు. ఇక ఏనుగులు వినోదానికైనా, విహారానికైనా గుంపులుగా తరలివెళ్తాయి.

 

 

ఇలా ప్రపంచంలోని ప్రతి ప్రాణీ సమూహ జీవనాన్ని ఇష్టపడుతుంది. మనిషి లాగా ఏ జాతికి చెందిన జీవికీ మనసుండదు కాబట్టి వాటి సంబంధ బాంధవ్యాల్లో పెద్దగా తేడాలు రావు. కానీ.. మనిషి విషయం అలా కాదు.

 

 

ఎదుటి వారి భావాలను ముఖాలలోనే చదువుతూ వారి ఆనంద విషాదాలలో పాలు పంచుకుంటాడు. సత్సంబంధాల కలిమిని హాయిగా అనుభవిస్తాడు. అందుకే మనం మనమే కాదు.. అనేక నేనులు కలిస్తే మనం.. అందరం హాయిగా ఉందాం.. అనే పాలసీ అందరికీ అలవడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: