అవి రెండు తెలుగు దిన పత్రికలు.. ఒకటి తెలుగులో తనంత మొనగాడు లేడు అది కూడా దశాబ్దాలు అంటూ రొమ్మువిరుచుకుంటుంది. ఆ విషయం లోగో కిందే రాసుకుంటుంది. మరొకటి అసలు దమ్ముతో వార్తలు రాయడంలో దుమ్ముదులపడంలో తనంత మొనగాడే లేడంటుంది. ఈ రెండింటిలోనూ సత్యం లేకపోలేదు. అయితే ఈ రెండు చంద్రబాబు కు మేలు చేయడంలో మాత్రం అంతులేని కమ్మనైన బంధాలు చాటతాయి. ఈ విషయంలో ఎలాంటి సిగ్గూ ఎగ్గూ వాటికి ఉండదు.

 

 

ఈ విషయం నిమ్మగడ్డ లేఖ విషయంలో మరోసారి రుజువైంది. తన ప్రాణాలకు ముప్పుందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారన్న వార్త.. బుధవారం సాయంత్రం బయటకు వచ్చింది. లేఖ మామూలుగా లేదు.. ఏపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ.. జగన్ అనే వాడొక దుర్మార్గ సీఎం అనే విషయాన్ని హైలెట్ చేస్తూ.. ఆయన ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రస్తావిస్తూ సాగింది. ఇక దీన్ని తెలుగు దేశం అనుకూల టీవీ ఛానళ్లు గంటల తరబడి హోరెత్తించాయి.

 

 

అయితే ఇంత జరుగుతున్నా నిమ్మగడ్డ గంటల తరబడి కిమ్మనకుండా ఉండిపోయారు. ఆ తర్వాత రాత్రి సమయంలో విలేఖరులు అడిగితే ఆ లేఖతో నాకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత మీడియాలో వచ్చే వార్తతో తనకు ఏ సంబంధమూ లేదని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు. దీంతో ఆ టీవీ ఛానల్లు రూటు మార్చాయి. లేఖ బయటకు వచ్చింది కానీ నిమ్మగడ్డ మాత్రం ఆ లేఖ తాను రాయలేదంటున్నాడు అంటూ స్వరం మార్చాయి. అంతవరకూ ఓకే... మరి తెల్లవారి పేపర్లలో ఏం రావాలి. సదరు రమేశే లేఖ తనది కానప్పుడు ఆ లేఖకు విలువేముంటుంది..

 

కానీ ఈ పచ్చ పత్రికలు మాత్రం సదరు రమేశ్ తనది కాదంటున్నా.. ఆ లేఖను తాటికాయంత అక్షరాలతో ఆయన అన్నట్టుగానే రాశాయి. అగ్రశ్రేణి పత్రిక మాత్రం బావుండదన్నట్టు రాసిందంతా రాసి చిట్టచివరగా దీన్ని ఆయన ధ్రువీకరించలేదని షరతులు వర్తిస్తాయి తరహాలో రాసింది. మరో పచ్చ పత్రిక కనీసం ఆ విషయం కూడా ప్రస్తావించలేదు.

 

ఆ రెండో పత్రికను వదిలేద్దాం.. ఎందుకంటే.. చంద్రబాబు కోసం ఆ పత్రిక యజమాని ఉరేసుకోమన్నా సంతోషంగా వేసుకుంటాడు అన్న పేరు ఉంది. మరి అగ్రశ్రేణి దిన పత్రికకు ఏమైంది. అసలు ఆ లేఖ నేను రాయలేదు అని ఆయన కచ్చితంగా చెప్పేశాఖ.. ఆ లేఖకు విలువ ఏముంటుంది.. ఆయన తనది కాదన్నా.. ఆయన ఫోటోలు వేసి.. ఆ లేఖలో ఏముందో అక్షరం అక్షరం వదలకుండా ఓ ఫుల్లు పేజీలో ప్రచురించారు.. ఇవేనీ మీరు ప్రవచించే పత్రికా విలువలు.. ఇదేనా తరచూ మీరు చెప్పుకునే పత్రికాస్వేచ్ఛ.. మరి ఇంతగా బరితెగిస్తుంటే..వైసీపీవాళ్లు నోటికి వచ్చినట్టు తిడుతున్నారంటే తిట్టరా.. మరి.. అనుకుంటున్నారు ఆంధ్రప్రజ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: