ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.  స్వదేశీయులకు ఈ వైరస్ ప్రభావం లేకున్నా.. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.  విదేశాల నుంచి వచ్చేవారు ముందుగా తగు చికిత్స తీసుకోవాలని.. కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే వారికి పరిమిషన్ ఉంటుందని అన్నారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి సమావేశంలో పేర్కొన్నారు.  తాజాగా నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

నల్గొండలోని జైల్ ఖానా సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్న 14 మంది వియత్నాం వాసులు సంచరించినట్లు అధికారులు గుర్తించారు.  సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వీరిని 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం 14 మంది వియత్నాం వాసులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏమైనా కరోనా లక్షణాలున్నాయా ? అనే అనుమానంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

 

 

ముందస్తు జాగ్రత్తలో భాగంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మద్య కాలంలో నల్లగొండకు 65 మంది విదేశీయులు వచ్చినట్లు  అధికారులు నిర్ధారించారు. అయితే వీరు ఎవరు.. ఎక్కడికి వెళ్లారు.. ఎవరిని కలిశారు అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.  ప్రస్తుం వియాత్నం వాసులకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన అనంతరం వీరికి కరోనా వైరస్ సోకిందా ? లేదా ? అనేది తేలనుంది. క్వారంటైన్‌కు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాాగా తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేవని.. విదేశాల నుంచి వచ్చిన వారే దీని భారిన పడ్డారని చెబుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: