దేశంలో ఓ ఆడపడుచుకి ఇన్నాళ్లకు న్యాయం జరిగింది.. కన్నూ మీన్నూ కానకుండా కామంతో రగిలిపోయి.. అన్యాయంగా ఓ యువతి పై అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని దారుణంగా హింసించి ఆమె మరణానికి కారణం అయిన నింధితులకు ఉరిశిక్ష విధించారు. ఎంతో భవిష్యత్ ఊహించుకొని పారామెడిస్ చేస్తున్న ఓ యువతి జీవితాన్ని ఛిత్రం చేసి భూలోకంలోనే యమలోకాన్ని చూపించిన నిర్భయ నింధితులకు ఉరిశిక్ష పడటంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో ఎంతో మంది నింధితులు ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న నిర్భయ నింధితులకు ఉరిపడ్డట్టే వారికి కఠిన శిక్ష అమలు చేయాలని మహిళాలో లోకం కోరుకుంటుంది.

 

అయితే నిర్భయ దోశులకు ఈ రోజు ఉరిశిక్ష విధిస్తున్న సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది.. వారికి జీవితంపై ఆశలు ఉన్నాయా?  మరికాసేపట్లో మరణిస్తామన్న సంగతి తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుందో అన్న విషయం రక రకాల చర్చలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి. అయితే నిర్భయ దోషులకు మాత్రం తమ మరణం తథ్యమని తెలుసు. దాన్ని సాధ్యమైనంత వరకూ వాయిదా వేయిద్దామని చూసి, విఫలమయ్యారు. చివరి క్షణాలు వచ్చేసరికి వారిలో మరణ భయం స్పష్టంగా కనిపించిందని జైలు అధికారి ఒకరు తెలిపారు.  ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పోలేదట.. వారిని ఉరికంబానికి తీసుకు వెళ్తన్న సమయంలో మాత్రం తనను క్షమించాలని ముఖేశ్ సింగ్ పదేపదే జైలు అధికారులను వేడుకున్నాడని తెలుస్తోంది.

 

తనను ఉరి తీయవద్దని అడుగుతూ ఉంటే, అధికారులు మాత్రం అతని వ్యాఖ్యలను పట్టించుకోకుండా, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అయితే ఉరిశిక్ష అమలు పరిచే సమయంలో అక్కడ ఐదుగురు మాత్రమే ఉన్నారట. జైల్లో ఉన్న సమయంలో  అక్షయ్ ఏ పని చేయలేదట.. కానీ పవన్, వినయ్, ముఖేశ్ కూలీ పని చేస్తూ కొంత డబ్బు సంపాదించారట. ఆ సొమ్ము వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: