నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల వల్ల ఉరి అమలు వాయిదా పడినా చివరకు న్యాయమే గెలిచింది. దోషులు ఈరోజు ఉదయం 5 : 30 గంటలకు ఉరికంభం ఎక్కారు. దోషులు ఉరితాళ్లకు వేలాడడంపై దేశ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దోషుల డెడ్ బాడీలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు వారి బంధువులకు అప్పగించనున్నారు. 
 
ఏడు సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం జరగటంతో ప్రజలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. జైలులో దోషులు ఎంత సంపాదించారనే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నలుగురు దోషులలో ముగ్గురు పని చేసి డబ్బులు సంపాదించడానికి ఆసక్తి చూపగా ఒకరు మాత్రం పని చేయడానికి ఆసక్తి చూపలేదు. వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా జైలులో పని చేసి డబ్బులు సంపాదించగా ముఖేష్ మాత్రం పని చేయడానికి ఆసక్తి చూపలేదు. 
 
దోషుల్లో అక్షయ్ కుమార్ 69,000 రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ 39,000 రూపాయలు... పవన్ గుప్తా 29,000 రూపాయలు సంపాదించారు. కూలి పని చేసి వీరు డబ్బు సంపాదించారు. అధికారులు దోషుల కుటుంబ సభ్యులకు డబ్బును అందజేయనున్నారని తెలుస్తోంది. పోలీసులు దోషులకు సంబంధించిన వస్తువులను కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. 
 
దోషులకు అధికారులు నిబంధనల ప్రకారం అన్ని అవకాశాలను కల్పించారు. తెల్లవారుజామున 3 : 30 గంటల సమయంలో పోలీసులు దోషులను లేపడానికి వెళ్ళగా వారు అప్పటికే మేల్కొని ఉన్నారు. స్నానం చేయడానికి, అల్పాహారం సేవించడానికి దోషులు అంగీకరించలేదు. వైద్య పరీక్షల అనంతరం దోషుల్లో ఒకరైన ముఖేష్ తనను క్షమించమని పోలీస్ అధికారులను ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. నలుగురు దోషులను నిబంధనల ప్రకారం తలారి పవన్ జల్లాద్ ఉరి తీశారు. 30 నిమిషాల పాటు వారి మృతదేహాలను అలాగే వేలాడదీశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: