ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటిదాకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దైన శైలిలో పాలన చేస్తున్నారు. పార్టీ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయిన జగన్ తీసుకోవాలిసిందే. కానీ జగన్ కి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే ముందుగా నిర్ణయం తీసుకునే ముందు జగన్ ఎవరైనా సలహాలు ఇస్తే ఆలోచిస్తారు. అది ప్రజలకు ఎంత మేరకు మంచిది అని అలోచించి   ఫైనల్ డెసిషన్ మాత్రం పూర్తిగా ఆయనదే అని వైసీపీ వర్గాలు బహిర్గతంగానే  చెబుతుంటాయి.  కానీ ఇప్పుడు జగన్ మొట్టమొదట సారి వేరే వాళ్ళ నిర్ణయాన్ని అమలుచేయబోతున్నారన్న  వార్త  వైసీపీ శ్రేణిలో హాట్ టాపిక్ గా మారింది.

 

అ వ్యక్తి ఎవరోకాదు, స్వయాన   అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి భార్య, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తల్లి, వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. తల్లి మాటని గౌరవించి, తల్లి నిర్ణయం మంచిగానే ఉంది అని భావించి జగన్ అమ్మ నిర్ణయాన్ని  ఓకే చేసాడు. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ అండ్ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే  నెల్లూరు లో జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌విని జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. దీంతో నెల్లూరులోని   కీల‌క నాయ‌కులు ఈ ప‌ద‌వుల‌ను త‌మ వారికి ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు.ఈ  క్రమంలోనే  నల్లపరెడ్డి  ప్రసన్న కుమార్ అప్పట్లో  సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వ్యక్తి. 

 

అయితే నల్లపరెడ్డి  కూడా త‌మ వారికి ఈ ప‌ద‌వి కోసం ప్రయ‌త్నించారు. కానీ  దీనికి భిన్నంగా నెల్లూరు  జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఆనం ఫ్యామిలీకి చెందిన ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి కూడా త‌న స‌తీమ‌ణి ఆనం అరుణ‌కు ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు. అయితే ఆనం ఫ్యామిలీ మొదట నుంచి   టీడీపీలో ఉంద‌ని,అప్పట్లో  జ‌గ‌న్‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు కూడా చేశార‌ని, కాబ‌ట్టి ఈ ఫ్యామిలీకి ఇలాంటి కీల‌క ప‌ద‌వి ఇవ్వరాద‌ని పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు వ్యతిరేక‌త వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ కి ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉండేవారని, వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి సీట్ ఇచ్చి, వైసీపీ పార్టీ అభ్యర్థులకు పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. 

 

కానీ ఇప్పుడు   అనూహ్యంగా జగన్ తల్లి ఈ వియయంలోకి ఎంటర్ అయ్యారు. దీనికి కూడా కార‌ణం ఉంది. ఆనం సోద‌రుల రాకకు ముందుగానే ఆనం విజ‌య్‌కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న కుమారుడు కూడా వైఎస్ విజ‌య‌మ్మకు అనుచ‌రుడిగా సేవ‌లు అందిస్తున్నారు. పార్టీ పనుల్లో కూడా చురుకుగా ఉంటారు. ఈ క్రమంలోనే త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఆనంకు ఫేవ‌ర్ చేయాల‌ని భావించిన విజ‌య‌మ్మ ఆనం అరుణ విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌న సిఫార‌సు పంపారు. అరుణ ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేట్ చేయాలనీ జగన్ ని కోరారు. 

 

విజయమ్మ సిఫార్లు చేయడంతో వైసీపీ త‌ర‌ఫున అరుణను నామినేట్ చేస్తున్నామ‌ని అధిష్టానం కూడా ప్రక‌టించింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఒక్కసారిగా  ఆశ్చర్యానికి గురి అయ్యారు. పార్టీ ప్రారంభం నుంచి  వైఎస్ కుటుంబంతోను ముఖ్యంగా విజ‌య‌మ్మ, భార‌తిలోనూ సాన్నిహిత్యంగా ఉండి. వారి క‌ష్టాల‌ను సైతం పంచుకున్నారు.ఫైనల్ గా  నెల్లూరు జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ విష‌యంలో విజ‌య‌మ్మ ఎంట్రీ తో వైసీపీ నేత‌లు ఆందోళనికి  గురవుతున్నారు. కొందరు నేతలైతే  ఏవన్నా ముఖ్యమైన పనులు ఉంటే విజయమ్మ తో చేయించుకోవచ్చు అనే నిర్ణయంలో ఉన్నారు. విజయమ్మ జ్యోక్యంతో అరుణకు నామినేషన్ షురూ అయింది. తల్లి మాటను గౌరవించాడు జగన్ అని కొందరు ప్రశంసిస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది పార్టీ మంచి కోసమే అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: