సాధారణంగా అడవిలో తిరిగే కృరమృగాళ్లో సింహం, పులి, చిరుత, ఎలుగు బంటి అంటే జనాల్లో ఒకరకమైన భయం. అవి గనక ఊళ్లలో తిరుగుతున్నాయని తెలిస్తే.. తమ ఇళ్లకే పరిమతం అవుతారు.. అటవి అధికారులు వచ్చి దాన్ని బందించే వరకు భయం గుప్పిట్లో బతుకుతారు. ఇటీవల కాలంలో అడవిలో చెట్లు నరకడం ఆరంభించిన తర్వాత అక్కడ జీవరాశులు ఊళ్లల్లోకి రావడం మొదలయ్యాయి.  ఇలాంటి సంఘలనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ గుంతలో పడిన పులిని రక్షించబోయిన గ్రామస్థులు, అటవీ అధికారులు తమ ప్రాణాల మీదకే తెచ్చుకున్న సంఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో  ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్ట్ చేశారు. 

 

ఇలాంటి భయంకర సంఘటన చూస్తుంటే.. నిజంగా గుండ జారిపోతుందని..  క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమే ఇందుకు కారణం.  అయితే పులి గుంతలో పడిందని తెసిన తర్వాత దానికి ఎంత విలైతే అంత దూరంగా ఉండాలి.. నిష్ణాతులైన సిబ్బందితో ఆ పులిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అక్కడ ఎవరు కూడా అలర్ట్ గా లేదు... పెద్దపులికి మత్తిచ్చేందుకు శిక్షణ పొందిన వారు లేరు. కాబట్టి, ఎవరూ ఇటువంటి అర్థరహిత పనులను చేసేందుకు ఉత్సాహం చూపించవద్దు. ఈ పెద్దపులి ఇలా ఎందుకు చేసిందని నన్ను అడుగుతున్నారు. అది పెద్దపులి కదా... అందుకే" అంటూ ఆయన కామెంట్ చేశారు. 

 

అయితే ఓ గుంతలో పెద్ద పులి పడిపోయిందన్న వార్త తెలుసుకున్న కొంత మంది గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. వారితో పాటు అటవీ సిబ్బంది కూడా చేరుకున్నారు.   దాదాపు గంట తరువాత అది బయటపడి, అప్పటికే గుంటలో పడి పోయి బెంబేలెత్తిన పులి  జనాలను చూసి బెదిరిపోయి, దాడికి దిగింది. ఓ వ్యక్తి పైకి ఎక్కేసి, అతన్ని కిందకు తోసింది. మరో వ్యక్తిపైనా దాడి చేసింది. అదృష్టం కొద్ది వారికి ఏమీ కాకుండానే పులి అడవిలోకి పారిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: