ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అని అనుకుంటున్న తరుణంలో జగన్  సర్కార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ  షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా  వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ సర్కార్ ఎన్నికల సంఘం పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పడం వల్ల ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆరోపించింది. అంతేకాకుండా దీనిపై న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు హైకోర్టుల ని కూడా ఆశ్రయించింది జగన్ సర్కార్. 

 

 

 జగన్ సర్కార్ పిటిషన్ పై  స్పందించిన సుప్రీం కోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది  రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మాత్రమేనని కోర్టులు జోక్యం చేసుకోలేవు అంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నికల కమిషనర్  రమేష్ కుమార్ రాసినట్లుగా ఓ లేక విడుదలైంది. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్... తనకు భద్రత కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన భద్రత లేకుండా విధులు  నిర్వహించలేను అంటూ  లేఖలో కోరారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ . ఆంధ్ర రాజకీయాల్లో  ఈ లేఖ చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ లేఖను నిమ్మగడ్డ రమేష్ పేరుతో వేరే ఎవరో  రాశారు అని కొంతమంది ఆరోపిస్తోంటే... ఇది ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారు అంటూ ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 

 

 ఏకంగా ఎన్నికల కమిషనర్ సైతం తనకు రక్షణ కావాలి అంటూ కోరింత పరిస్థితిని జగన్ సర్కార్ రాష్ట్రంలో తీసుకొచ్చింది ప్రతిపక్ష టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే లేక స్వయంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశారా లేకపోతే ఎవరైనా వ్యక్తులు రాసి  ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా ప్రచారం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి తెలంగాణ బిజెపి నేత కిషన్ రెడ్డి స్పందించారు. రక్షణ కావాలంటూ ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ తమకు అందిందని.. ప్రభుత్వం ఎన్నికల సంఘం కమిషనర్ పై దాడులకు పాల్పడడం సరైనది కాదు అంటూ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సరైన భద్రత కల్పిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: