మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఏడాదిన్నర క్రితం అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూలదోయటానికి ఎప్పటికప్పుడు బిజెపి ప్రయత్నాలు చేస్తునే ఉంది. మొత్తానికి కమలం పార్టీ నేతల ప్రయత్నాలు ఇంత కాలానికి సఫలమైంది. శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోవాల్సిన ముఖ్యమంత్రి కమల్ నాథ్ అంతకన్నా ముందే  రాజీనామా చేయటంతో ప్రభుత్వం కూలిపోయినట్లైంది. మరి ఇపుడు బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమమైంది.

 

కాంగ్రెస్  సీనియర్ నేత కమల్ నాధ్ నేతృత్వంలో  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎప్పుడెప్పుడు పడగొడదామా ? అనే బిజెపి నేతలు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో చిచ్చుపెట్టి చీలిక తెద్దామని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు సాధ్యం కాలేదు.  దాంతో ఏమి చేయాలో ఆలోచిస్తున్న సమయంలో పార్టీలోనే ముసలం బయలు దేరింది.  మరో పవర్ ఫుల్ నేత జ్యోతిరాధిత్య సింథియా రూపంలో పార్టీలోనే అసంతృప్తి బయటపడింది.

 

అయితే దాన్ని అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. సిఎం కమల్ నాధ్ కు వ్యతిరేకంగా కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు ఏకమవుతున్నా సోనియా గాంధి అస్సలు లెక్క చేయలేదు. దాంతో ఏకమైన వాళ్ళందరికీ సింథియానే నాయకుడనే విషయం మెల్లిగా బయటపడింది. అప్పుడైనా  సోనియా కల్పించుకుందా అంటే అదీ లేదు. పైగా సింథియాను మరింత దూరంగా పెట్టింది.

 

సోనియా-సింథియా మధ్య బాగా గ్యాప్ రావటానికి ప్రధాన కారణం మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్, కమల్ నాధే అని ప్రచారం. సరే విషయం ఏదైనా వెంటనే కమలం పార్టీ నేతలు రంగంలోకి దిగేశారు. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న బిజెపి నేతలు లడ్డూలాంటి అవకాశం వస్తే విడిచిపెడతారా ? అందుకనే లోపాయికారీగా సింథియాతో చేతులు కలిపారు. యువనేత డిమాండ్లు ఏమిటో తెలుసుకున్నారు. అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇంకేముంది మంత్రులు, ఎంఎల్ఏలు 22 మంది బయటకు వచ్చేశారు. కమల్ బలపరీక్షకు ముందే సింథియా రాజ్యసభ ఎంపిని చేసేసింది. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. కథ కంచికి మనం ఇంటికి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: