తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబుకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా విలన్ గా  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. ఇక టాలీవుడ్ కలెక్షన్ కింగ్ పేరు  తెచ్చుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నటుడిగానే కాకుండా  మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు సంపాదించారు. ఇక మోహన్ బాబు నట వారసుడిగా మంచు మనోజ్, మంచు విష్ణు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మోహన్ బాబు  నట వారసురాలిగా లక్ష్మి మంచు  బుల్లితెరపై మరోవైపు వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. 

 


 పలు సినిమాల్లో అందమైన పాత్రలో నటించిన మంచు లక్ష్మి... బుల్లితెరపై యాంకర్ గా  కూడా తన సత్తా చాటింది. వివిధ కార్యక్రమాల్లో హోస్ట్ గా  అదరగొట్టింది. అయితే మంచు లక్ష్మికి మంచు వారి కుటుంబం అన్న... నాన్న మోహన్ బాబు అన్న ఎక్కడ లేని గౌరవం అన్న విషయం తెలిసిందే. ఎవరైనా కాస్త చులకనగా తమ కుటుంబం గురించి మాట్లాడారు అని అనిపిస్తే మాత్రం... లెఫ్టు రైటు ఇచ్చేసి రఫ్ ఆడించేస్తుంది. అందుకే మంచు లక్ష్మి ఏదైనా షోకి హాజరైనప్పుడు... తండ్రి మోహన్ బాబు గారి గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు చాలా మంది. ఇకపోతే నిన్న మోహన్ బాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. 

 

 ఈ నేపథ్యంలో తండ్రి మోహన్ బాబుకు కుమార్తె లక్ష్మి మంచు ఓ  వినూత్నమైన మర్చిపోలేని కానుక బహుమతిగా ఇచ్చారు. తండ్రి మోహన్ బాబు కోసం ఏకంగా మంచు లక్ష్మి ఓ సింహాసనాన్ని తయారుచేయించి బహుమతిగా ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మంచు లక్ష్మి. మా నాన్నకి పుట్టినరోజు సందర్భంగా కొత్త సింహాసనం.. సింహాసనం లోని మూడు సింహాలు... మా ముగ్గురు కి నిదర్శనం... దీన్ని స్వయంగా నేనే చేయించాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది మంచు లక్ష్మి. కాగా ఈ సింహాసనంలో ఫ్యామిలీ మొత్తం దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  సూర్య హీరోగా నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మోహన్ బాబు  కనిపించబోతున్నారని కూడా గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: