ఈ మహమ్మారి ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ప్రపంచం లో అన్ని దిక్కులలో  వ్యాపించేసి బాధిస్తోంది. ఈ కరోనా అందర్నీ హింసిస్తోంది. ఎప్పుడు ఎవరి ప్రాణం తీసుకుంటుందో ఎవ్వరికి తెలియని దుస్థితి. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుని గజగజలాడిస్తోంది ఈ కరోనా వైరస్. జాగ్రత్తగా ఉండాలని అనేక విషయాల తో అవగాహన ఇస్తున్నారు.

 

IHG

 

 

అలానే తప్పక పాటించడానికి కొన్ని చర్యలని కూడా తీసుకోమంటున్నారు. అలానే ఇంటి నుండి బయటకి రావడం కూడా మంచిది కాదు అని చెప్పుకొచ్చారు. జనం ఎక్కువగా ఉన్న చోట్లకి వెళ్ళ వద్దని. పార్టీలు, పెళ్లిల వద్దకు కూడా వెళ్ళద్దు అని  కూడా చెప్పారు. అయితే ఈ కరోనా రోజు రోజుకి జోరుగా వస్తోంది. ఖండాలు దాటి దేశాలు దాటి పీడిస్తోంది. 

 

 

తాజాగా కరోనా గురించి పలు వ్యాక్యాలు చెప్పుకొచ్చారు. అధికంగా క్యాష్  ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ కుదిరినంత వరకు డిజిటల్ గా పేమెంట్లు చెయ్యడమే ఉత్తమం అని చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత వరకు కార్డులు , నోట్లు వద్దు అంటూ చర్చ సాగింది . వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్లే బెస్ట్ అని వెల్లడించింది. ఇప్పుడు డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమం అట.

 

 

నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సకాక్షన్ చెయ్యడం మంచిది వ్యక్తి వద్దకి వెళ్లి డబ్బులు ఇవ్వడం కంటే అని అంటున్నారు. కాబట్టి సురక్షితంగా , ఆరోగ్యంగా ఉంటూ ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఆన్లైన్ పేమెంట్ మెరుగు. కరెన్సీ నోట్లతో కూడా ప్రమాదమేనా అంటే ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ లో పేమెంట్ సులభం, సురక్షితం .

మరింత సమాచారం తెలుసుకోండి: