భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలు ఎవరు ఎక్కడ గుమిగూడి ఉండకుండా  ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రముఖ ఆలయాలు కరోనా  వైరస్ నియంత్రణకు సహకరిస్తూ మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు శబరిమల ఆలయం సహా... షిరిడి లాంటి ప్రముఖ ఆలయాలు కూడా కరోనా వైరస్ వల్ల మూసివేశారు. ఇక ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ ప్రభావం అయోధ్య రాముడు మీద కూడా పడింది. 

 

 

 అయోధ్య లో  శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేయాలంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా  వైరస్ ప్రభావం ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా ఉండడం వలన...ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో ఏళ్ల పాటు వివాదాస్పద స్థలం గా ఉన్న  అయోధ్య భూభాగం విషయంలో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుని భూభాగం శ్రీరాముడు జన్మ భూమి అని హిందువులకు చెందుతుంది అంటూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి అయోధ్య లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అనుకుంటున్న తరుణంలో... కరోనా  వైరస్ ప్రభావం వల్ల శ్రీ రామనవమి  వేడుకలను రద్దు చేసింది యూపీ సర్కార్.

 

 

 ఈ వేడుకలకు ప్రజలు ఎవరిని అనుమతించ వద్దు  అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో కూడా రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో... ప్రజలు  గుమికూడి కుండా  చేసేందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలను రద్దు చేసిన నేపథ్యంలో హిందువులకు కాస్త నిరాశే ఎదురైంది అని చెప్పారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలం నుండి వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూమిని రామజన్మభూమి ట్రస్టుకు చెందుతుంది అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అనంతరం...రామ  జన్మభూమి హిందువులకు  వచ్చాక మొదటి సారి జరగబోతున్న శ్రీరామ నవమి వేడుకలు రద్దు అవ్వడం  ప్రస్తుతం కొంతమంది నిరాశతో కూడా గురి చేస్తోంది. ఒక వేళ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే పెను ప్రమాదానికి దారితీస్తాయని ఆలోచనతోనే ఇలా వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: