ప్రతిపక్ష నేత చంద్రబాబు దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో సీనియర్ నాయకుడు అని చెప్పవచ్చు. తానే స్వయంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటూ చాలాచోట్ల ఏవిధంగా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. లేని మాటలు మాట్లాడుతూ అందరి ముందు కామెడీ అయిపోతున్నారు. ఈ విధంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడారు. ఏపీ మీడియాలో కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసినట్లు తెగ ప్రచారం జరుగుతుంది. ఈ లెటర్ కు సంబంధించి నిమ్మగడ్డ తప్ప మిగతా వారందరూ . ఈ లెటర్ ఎవరు రాశారు అన్న దాని విషయంలో అధికార పార్టీ వైకాపా డిమాండ్ చేసినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం నోరు  తెరవలేదు.

 

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం గురించి సమీక్ష సమావేశంలో చర్చించారు. అనంతరం వైసీపీ పార్టీ నాయకులు రాష్ట్ర డిజిపిని కలిసి అసలు ఈ లెటర్ వాస్తవమో కాదో ఎక్కడినుంచి పుట్టిందో తేల్చాలని ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో ఆ లెటర్ అసలు నిజమో కాదో తెలియని దాని గురించి చంద్రబాబు నాయుడు స్పెషల్ గా మీడియా సమావేశం పెట్టారు. ఆ లేఖ నిజంగా వెళ్లిందో లేదో.. జగన్ సర్కారు కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు.

 

కామన్ సెన్స్ లేని ఇలాంటి డిమాండు ఆయన ఎలా చేస్తున్నారో తెలీదు. ఎందుకంటే... లేఖ నిజమో నకిలీనో తెలీదు. ప్రభుత్వం పోలీసు దర్యాప్తు చేయిస్తోంది. అదేమీ తేలకముందే.. కేంద్రాన్ని దాని గురించి అడిగితే నవ్వులపాలు కావడం తప్ప దక్కేదేమీ ఉండదు. దీంతో చంద్రబాబు మాటలు వింటున్న చాలామంది ఏం మాట్లాడుతున్నావ్ చంద్రబాబు? చిన్న మెదడు చితికిందా..? ఎందుకు ఈ మధ్య నిన్ను నువ్వే కామెడీ చేసుకుంటావ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: