పుస్తకాలు చదవడం వలన ఎంతో విజ్ఞానం పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చాలా మందికి ఈ పుస్తక పఠనం చేసే అలవాటు ఉండదు. చిన్నతనం నుండి వ్యక్తి వయసు వచ్చే వరకు ఆడుతూ, పాడుతూ సమయాన్ని వృధా చేస్తారే తప్ప ఒక దగ్గర కూర్చొని చదివేందుకు మాత్రం సమయాన్ని కేటాయించారు. నిజానికి కేటాయించలేరు. ఎందుకంటే వారికి చిన్నప్పటినుండే పుస్తక పఠనం అలవాటు ఉంటేనే పుస్తకాన్ని పట్టుకొని చదివే ఓపిక ఉంటుంది. లేకపోతే పుస్తకాల్లో ఎంత మంచి జ్ఞానం ఉన్నప్పటికీ అవి చదవాలనే ఆసక్తి ఉండదు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనం చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. తమ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిద్దిదే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అనవసరమైన వస్తువులను కొనిస్తారు కానీ పుస్తకాలను మాత్రం చాలా తక్కువగా కొనిపెడతారు.




మొబైల్ ఫోన్లు, బైకులు ఇంకా ఇతరత్రా వస్తువులను వాళ్లకి చిన్నతనంలోనే అలవాటు చేసి వారి జీవితాన్ని నాశనం చేస్తారు. అదే ఒకవేళ పుస్తకాల కొని పుస్తక పఠనం నేర్పిస్తే వారి పిల్లలు త్వరగా జ్ఞానాన్ని సంపాదించి సమాజంలో తెలివికలవాళ్ళ గా తయారవుతారు. 10 సంవత్సరాల వయసు నుండి మీరు మీ పిల్లలకు పుస్తకాలను కొని ఇచ్చి పుస్తక పఠనం అలవాటు చేయండి. ఇలా చేయడం వలన వారు అద్భుతమైన పదజాలాన్ని నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక పుస్తకాలను కొనిస్తే వారి వ్యక్తిత్వం కూడా అద్భుతంగా దృఢపడుతుంది. పుస్తకాలను అదేపనిగా చదవడం వలన పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వారి ఆలోచన గొప్పగా మారుతుంది. చిన్నపిల్లలు పది కొత్త విషయాలు తెలుసుకుంటే మరొక 20 విషయాల గురించి వారు సొంతంగా ఆలోచించగలరు.




చదువుతున్నకొద్దీ వారిలో రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇలా వారి మెదడులో రకరకాల కొత్త విషయాలు చేరడం వలన... వారి మేధాశక్తి పెరుగుతూ పోతుంది. చిన్నతనంలోనే పుస్తక పఠనం చేయడం వలన చదివిన ప్రతి విషయం తొందరగా మైండ్ కి ఎక్కడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంటుంది. చిన్నప్పటి నుండే పుస్తకాలను చదివిన వారు ఎంతో మంది దేశ నాయకులుగా ఎదిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే చదవడం బ్రెయిన్ కి వ్యాయామం లాంటిది. చిన్నప్పటినుండే శారీరక వ్యాయామం చేస్తే ఎలా మనం దృఢంగా తయారవుతామే అలానే చదవడం వలన మానసికంగా దృఢంగా తయారవుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: