తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో ఓ రేంజులో ఉంటాయి అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాజకీయాల పుణ్యామా మీడియా పాత్ర చాలా ఎక్కువ. ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీకి ఓ ప్రముఖ మీడియా సంస్థ బ్యాక్ బోన్ గా నిలిచింది. ఇంకా మద్దతు ఇస్తూనే ఉంది. ఎవరు అవునన్నా కాదన్న తెలుగు నాట మీడియా ప్రస్తుతం రెండు ముక్కలై పోయింది. దీంతో ఈ రెండు మీడియా వర్గాలు ఒకదాని మీద మరొకటి కుల ముద్ర వేసుకునే ఈ విధం గా తయారయ్యాయి.

 

 

కుల కుంపటి లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియా మొత్తం భ్రష్టు పట్టి పోయింది. చాలా వరకు రెండు కులాల మధ్య రాజకీయాలు జర్నలిజాన్ని బ్రష్టు పట్టించడం జరిగింది. ఎటువంటి విలువలు లేని రాజకీయాలను మీడియా రాజ్యమేలుతున్న ఇటువంటి సమయంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ మరొక సీనియర్ జర్నలిస్టు చర్చా కార్యక్రమంలో కడిగిపారేశారు. టీడీపీ కోసం ఒకప్పుడు పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు వైసీపీ మీడియా లో వర్క్ చేస్తున్నారు.

 

 

ఈ నేపథ్యంలో చర్చలో భాగంగా ఇద్దరు జర్నలిస్టులు సీరియస్ అయిపోయిన కొట్టుకునే దాకా వెళ్లి ఒకప్పుడు టిడిపికి సపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు చెంప చెల్లుమనేలా పగలగొట్టాడు మరొక జర్నలిస్ట్. ఈ వీడియో మొత్తం చూసిన కొంతమంది చాలా చండాలంగా తయారయింది జర్నలిజం లైవ్ లో ఎంత దారుణంగా అలా కొట్టుకుంటారు వాళ్ళు ప్రజలు ఇంకా ఎవరి మాటలు నమ్మాల్సి వస్తోంది అంటూ కొంతమంది గొడవ పై అసహనం వ్యక్తం చేస్తూ ఏపీ జర్నలిజం కంపు జర్నలిజం అని మండిపడుతున్నారు. ఉన్న కొద్దీ మీడియా చానళ్లు కూడా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ లాగా మారిపోతున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు జనాలు. లైవ్ స్టూడియో అయితే ఏపీ అసెంబ్లీ ని తలపిస్తుందని మరి కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: