తెలంగాణ జాగృతి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన కవిత చాలావరకూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కవిత రాజకీయాలకు దూరం అయిపోయారు అన్న వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల రాజ్యసభకు టిఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది పేర్లు వినబడుతున్న తరుణంలో కవిత పేరు కూడా వచ్చింది...అయితే చివరకు కెసిఆర్ కవిత పేరు ని పక్కన పెట్టి మిగతా వాళ్లను రాజ్యసభకు ఎంపిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కెసిఆర్ ఎమ్మెల్సీగా కూతురు కవిత ని రంగంలోకి దింపటం జరిగింది.

 

కవితని ఎమ్మెల్సీగా చేసి కచ్చితంగా కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఒకవేళ కవితని మంత్రివర్గంలోకి తీసుకునే ఉద్దేశం కేసీఆర్ కి ఉంటే ఎవరి పోస్ట్ ఊస్ట్ అవుతుందో అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంత మంది పేర్లు వినపడుతున్నాయి వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు చెందిన చామకూర మల్లారెడ్డి ఉన్నట్లు చర్చ సాగుతోంది.

 

ఈటల రాజేందర్ పనితనం బాగా లేదని తెలుస్తున్నా.. కరోనా వైరస్ నేపథ్యంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి వెన్నంటే ఉండడంతో ఈటలను తొలగించే అవకాశం లేదని ఖచ్చితంగా మంత్రి జగదీష్ రెడ్డి పోస్ట్ పోయే అవకాశం ఉందని అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ వర్గాలకు చెందినవారు. మరోపక్క నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి కవిత కోసం త్యాగం చేస్తారని సమాచారం. మరి ఇంతకీ కెసిఆర్ కవితని మంత్రివర్గంలోకి తీసుకుంటాడో లేదో చూడాలి. మొత్తం మీద కవిత రాకతో ఇప్పుడు టిఆర్ఎస్ మంత్రులకు చెమటలు పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: