కరోనా లేదా కొవిడ్-19 వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా 2.20 లక్షల మంది దీని బారిన పడగా.. సుమారు 10వేల మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇక కరోనా గురించి నిజాలు కంటే ఫేక్ న్యూస్‌లే సోషల్ మీడియాలో ఎక్కువగా వ‌స్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వ‌చ్చే ఫేక్ న్యూస్‌ల‌ను అరికట్టేందుక భారత ప్రభుత్వం “MY GOV” పేరుతో కరోనా హెల్ప్ డెస్క్ ను  స్టాట్ చేసింది.

 

ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు ఈ వైర‌స్‌పై అవగాహన కల్పించే ప్రయత్నంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఫేక్ న్యూస్‌ల నుంచి దూరంగా ఉండటానికి మ‌రియు కోవిడ్‌-19 పై సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం `వాట్సాప్ చాట్‌బాట్‌`ను క్రియేట్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పిపిఎ) వాట్సాప్ నంబర్‌ను ప్ర‌క‌టించింది. ఈ వాట్సాప్ నెంబర్..  9013151515. దీన్ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి. కరోనా వైర‌స్‌కు సంబంధించి మీరు ఈ వాట్సాప్ నెంబ‌ర్‌లో ప్రశ్నలు అడిగితే.. మీకు ఆటోమెటిక్ గా స‌మాధానం వ‌స్తుంది.

 

అలాగే కరోనావైరస్ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ + 91-11-23978046, టోల్ ఫ్రీ నంబర్ 1075.  కరోనావైరస్ పై ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ఇమెయిల్ ఐడిని  కూడా (ncov2019@gov.in) విడుదల చేసింది. కాబ‌ట్టి వీటిని ఉప‌యోగించుకుని క‌రోనా వైర‌స్‌పై వ‌స్తున్న ఫేక్ న్యూస్‌ల‌కు దూరంగా ఉండ‌డండి. కాగా, ఈ క‌రోనా వైర‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాప్తిచెందుతుంది.  తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16కు చేరింది. కాగా.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగింది. మ‌రోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకి చెరాయి.

 

 
 
 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: