ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా  వైరస్  జయించవచ్చు రెండు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ఇకపోతే తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తో పాటు ఆమె తనయుడు ఎంపీ దుష్యంత్ సింగ్  సెల్ఫ్ క్వారంటైన్  లోకి వెళ్ళిపోయారు. అయితే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింగర్ కనికా కపూర్ తో కలిసి పార్టీలో పాల్గొన్నారు. ఇక ఇదే పార్టీలో వసుంధర రాజే తో పాటు ఆమె తనయుడు ఎంపీ సుశాంత్ సింగ్ కూడా పాల్గొన్నారు. అయితే కనికా కపూర్ కు కరోనా  పాజిటివ్ అని తేలడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారందరూ అప్రమత్తమయ్యారు. 

 

 

 అయితే ఈ పార్టీలో దాదాపు వందలాది మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తో పాటు ఆమె తనయుడు దుశ్యంత్ సింగ్  కూడా ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కానీ సదరు పార్టీలో పాల్గొన్న వసుంధర రాజే కుమారుడు ఎంపీ దుష్యంత్ మరుసటి రోజే పార్లమెంటుకు వెళ్లడం ప్రస్తుతం అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంటులో పలువురు ఎంపీలతో కూడా కలిశారు దుశ్యంత్ . అయితే ఇటీవలే లండన్ నుంచి ముంబైకి వచ్చిన సింగర్ కనికా కపూర్ లక్నోలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ లో పాల్గొన్నారు.

 

 

 అయితే తాను విందు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కనికా కపూర్ ఖండిస్తున్నారు. ఇకపోతే  రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు సుశాంత్ సింగ్ కూడా పార్టీలో పాల్గొన్న మరుసటిరోజు పార్లమెంటు హాజరు కావడంతో పార్లమెంటుకు కూడా కరోనా వైరస్ ముప్పు ఉంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు పార్టీకి హాజరైన ప్రతి ఒక్కరిని ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ ఫోన్ లు చేస్తుంది. పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సెల్ఫ్  ఐసొలేషన్ లో ఉండాలి అంటూ ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే  ఆమె కుమారుడు దుశ్యంత్  కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో  ఉన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: