ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో రోజా ఎంత కీలక నేతగా ఉన్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం నగరి ఎమ్మెల్యే గానే కాకుండా ఏపీఐఐసీ చైర్మన్గా కూడా రోజా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అయితే పదవి రాకముందు నుంచే జబర్దస్త్ ప్రోగ్రాం సాగుతున్నారు కాబట్టి.. పదవి  వచ్చిన తర్వాత కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్ళ లేదు రోజ. అంతేకాకుండా బతుకు జట్కా బండి లాంటి ప్రోగ్రామ్స్ తో  బుల్లితెరపై సత్తా చాటుతోన్నారు.  అయితే రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన విషయం తెలిసిందే. తన డాన్సులతో అదిరిపోయే నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ఏదైనా ప్రోగ్రామ్  జరిగింది అంతే చాలు డాన్సులతో అదరగొడుతుంది రోజ. 

 

 అయితే క్యాబినెట్ హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత కాస్త డాన్సులు తగ్గించింది. ఇదిలా ఉంటే శేఖర్ మాస్టర్ తో గతంలో ఓ ఈవెంట్ లో రోజా డాన్స్ చేసి  విమర్శల పాలైంది ఎమ్మెల్యే రోజా. ఇక చిన్నప్పటినుంచి తాను రోజు ఫ్యాన్  అని చెప్పుకునే శేఖర్ మాస్టర్ రోజా కి డాన్స్ లో పర్ఫెక్ట్ జోడి అనే విధంగా ఉంటారు. అయితే ఏపీఐఐసీ చైర్మన్ గా  పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్యాన్సులను కాస్త తగ్గించిన  రోజా..  మరోసారి శేఖర్ మాస్టర్ తో చిందులేసింది. ఉగాది సందర్భంగా ఈటీవీ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ తో కలిసి రోజా జడ్జిగా వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవలే బాగా హిట్ అయిన పాటల్లో  డ్యాన్సులు చేశారు రోజా శేఖర్ మాస్టర్. 

 


 అయితే తాజాగా విడుదలైన ప్రోమో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపిస్తోంది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా వీరిద్దరి డాన్సులు అదుర్స్ అనిపించినప్పటికీ... రోజా డాన్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి.. క్యాబినెట్ హోదా ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ గా  కొనసాగుతూ.. ఎంతో  బాధ్యతగా వ్యవహరించాల్సిన కోసం ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తో స్టెప్పులు వేయడం పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. కొంతమంది వీరి పర్ఫామెన్స్ ను ఎంజాయ్ చేసి కామెంట్ పెడుతుంటే ఇంకొంతమంది రోజా ముందు శేఖర్ మాస్టర్ చిన్న పిల్లలు ఎలా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమంది బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి డాన్స్ లు  ఏంటి మేడం అంత ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: