ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తూ  రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది కరోనా వైరస్. రోజురోజుకు కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరుణ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలకు పైగా ఈ కరోనా వైరస్ వ్యాపించింది. అయితే ఇప్పుడు వరకు ఎంతోమందికి సోకినా ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఇంకెంతో మంది మృత్యువుతో పోరాడేలా  చేసింది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు అందరూ చిగురుటాకులా వణికిపోతున్నారు . ఎక్కడ తమకు కరోనా వైరస్  సోకుతుందని బెంబేలెత్తిపోతున్నారు. 

 

 అయితే మొన్నటి వరకు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం రూటు మార్చినట్లు తెలుస్తోంది. మొదట జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం మళ్లీ తిరిగి జంతువుల్లోని వ్యాపిస్తుండడం  కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుచోట్ల జంతువులకు ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తెలియడంతో ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువులు సైతం నడిరోడ్డు మీద పడి చనిపోయిన విషయం గతంలో కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి మరోసారి వచ్చేలా కనిపిస్తోంది. హాంకాంగ్ లో  మనుషులకే కాదు ఇప్పుడు జంతువులకు కూడా కరోనా  వైరస్ సోకుతుంది. 

 

 దీనిపై హాంకాంగ్ ప్రభుత్వం స్పందించింది కూడా. ఇప్పటికే ఓ పెంపుడు కుక్క కు కరోనా  సోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మరో పాజిటివ్ కేసు  కూడా నమోదైనట్లు  తెలుస్తోంది. ఇక మనుషులతో పాటు పెంపుడు జంతువులకు కూడా దీన్ని హాంకాంగ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది  మనుషులకు సోకితే వారినీ  వైరస్ నుంచి బయటపడేయటం  కష్టంగా మారింది  ఇక ఇప్పుడు  జంతువులకు కూడా ఇదే పరిస్థితి వస్తే  మరింత  చేయి దాటిపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే కరోనా  పాజిటివ్ లక్షణాలు ఉన్న సదరు కుక్కను జంతువుల ప్రత్యేక కేంద్రానికి తరలించి పర్యవేక్షిస్తున్నారు వైద్యులు, ఈ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది. హాంకాంగ్ ప్రజలు పెంచుకున్న పెంపుడు జంతువులకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వాటిని ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచి...  తర్వాత వైద్య అధికారుల కు సమాచారం అందించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: