మొన్నటివరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించిన కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తెరమీదికి వస్తూ నిర్బంధం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణతో విలవిలలాడి పోతున్నాయి. ఇక రోజురోజుకు కరోనా వైరస్ ప్రజల్లో  ప్రాణభయం పాతుకుపోయేల  చేస్తోంది. అయితే దేశంలో ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినప్పటికీ కరోనా  పాజిటివ్ కేసులు మాత్రం దేశంలో రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి కరోనా  ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 

 

 

 అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలు సహా అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో కూడా నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నో సంస్థలు  తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్  హోమ్ చేయాలి  అంటూ ఆదేశించారు. చాలా ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించి కరోనా  వైరస్ నియంత్రణకు సహకరిస్తున్నాయి. తమ ఉద్యోగులను ఇంటికి మంచి పని చేయాలని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ఈ నిర్ణయం తీసుకుంటున్నాము  అంటూ తెలిపాయి.

 

 

 

 దీంతో సామాజిక దూరం పాటిస్తూ  ఇంట్లో నుండే  పని చేస్తున్నారు చాలా మంది ఉద్యోగులు. ఇక ఇలా సామాజిక దూరం పాటిస్తూ  ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్లైన్,  ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఉద్యోగ సంస్థతో కాంటాక్ట్ అవుతున్నారు . అయితే వర్క్ ఫ్రం హోం కరోనా  వైరస్ నియంత్రించేందుకు మంచి విషయమే అయినప్పటికీ ఇంటి నుంచి పని చేయడం ద్వారా ఉద్యోగులకు ఎక్కువ డేటా ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్,  జియో తమ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. బిఎస్ఎన్ఎల్ కొత్త కనెక్షన్లు తీసుకొని వారికి ఒక నెల ఉచితంగా బ్రాడ్ బ్యాండ్  సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు జియో కూడా తాము అందిస్తున్న మొబైల్ దాటాను డబుల్  చేస్తూ నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో జియో,  బిఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులకు డేటా ఖర్చు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: