దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో 19 మంది కరోనా భారీన పడ్డారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో నిషేదాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను సామూహిక జనసంచారం లేకుండా చూడాలని ఆదేశించింది. ఐదుగురు కంటే ఎక్కువమంది ఒకేచోట గుమికూడొద్దని సూచించింది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో, తహశీల్దార్లకు సమర్పించాలని సూచించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... వారికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు స్వీయ క్వారంటైన్ కు వెళ్లేలా చేయాలని, వారి కదలికపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి వివరాలను కూడా సేకరించాలని.... 26 అంశాలతో కూడిన నమూనాను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అందజేసింది. చట్టబద్ధంగా జరగాల్సిన సమావేశాలు కాకుండా ఇతర సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం సూచించింది. 
 
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల బయట బకెట్ నీళ్లు, సబ్బు అందుబాటులో ఉంచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. షిఫ్ట్‌ల పద్ధతిలో ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారని సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: