దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా ఈ వైరస్ ఇప్పుడు దేశంపై పంజా విసిరింది. ఇప్పటి వరకు దాదాపు 250 మందికి కరోనా వైరస్ సోకింది. 5 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉందని భావిస్తున్న భారత ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దేశ౦లో పలు నగరాలకు విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో రద్దు చేసే విధంగా భారత ప్రభుత్వం ముందుకి వెళ్తుంది. 

 

అదే విధంగా కొన్ని నగరాలకు రవాణా ను పూర్తిగా బంద్ చెయ్యాలని చూస్తున్నారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు పూర్తిగా రవాణా సౌకర్యాన్ని నిలిపివేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ మీద తెలివిగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఎక్కడ ఏ అలసత్వం ప్రదర్శించినా సరే ఇబ్బందులు రావడం అనేది ఖాయంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. 

 

ఎక్కడిక్కడ ప్రజలను నిలిపివేయాలని ఎవరిని కూడా బయటకు రానీయకుండా దేశం మొత్తం కర్ఫ్యూ విధించాలని ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే కఠిన ఆంక్షలు విధించే ప్రయత్న్నం కేంద్రం చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ముందుగా కఠిన చర్యలను అమలు చెయ్యాలని మోడీ సర్కార్ భావిస్తుంది. ఎక్కడిక్కడ ప్రజలను కట్టడి చేస్తే వైరస్ ని కట్టడి చేయడం అనేది పెద్ద విషయం కాదని కేంద్ర సర్కార్ భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని దీనికి సోషల్ మీడియా సహా అనేక మాధ్యమాల్లో ప్రచారం మరింతగా చేయించాలి అని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: