మన దేశం ఎంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా.. ఇప్పటికి 70 శాతం జనం వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వారందరికీ ఆధారం రైతన్నే. మరి అలాంటి రైతుకు మాత్రం ప్రభుత్వాల నుంచి అంత చేయూత లభించడం లేదన్నది నిష్టుర సత్యం. ఆ లోపాన్ని సవరించేందుకు జగన్ సర్కారు కొంత వరకూ ప్రయత్నిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సేవకై ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది.

 

 

మే నాటికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న తలంపుతో జగన్ సర్కారు పట్టుదలతో ఉంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై తరచూ సమీక్షలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికే 4 వేల కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 4 వేల కేంద్రాల ఏ‌ర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సాప్ట్‌వేర్‌ కూడా సిద్ధమైంది.

 

 

ఈ రైతు భరోసా కేంద్రాలు ఏంచేస్తాయంటే.. రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయాల్లో రైతులకు ఫెసిలిటీ సెంటర్‌గా పని చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విస్తీర్ణం తక్కువ ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది బ్యాంకర్లు రుణాల విషయంలో టార్గెట్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సూచించారు.

 

 

ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలుగా సహాయ పడతాయి. రైతులకు సంబంధించిన సేవలన్నీ ఇక ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే లభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భూములు, పంటలు, రుణాలు, ఇలా అన్ని అంశాల కోసం ఇక రైతు ఎక్కడకూ వెళ్లాల్సిన పని ఉండదు. రైతు భరోసా కేంద్రాలే అన్ని సమస్యలకూ పరిష్కార కేంద్రాలుగా నిలుస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: