కర్ఫ్యూ.. రేపు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అసలు కర్ఫ్యూ అంటే ఏంటి అని ఎంతోమందికి సందేహం వచ్చి ఉంటుంది. కర్ఫ్యూ ను సాధారణంగా అల్లర్లు హింసాత్మక సంఘటనలు చెలరేగినప్పుడు విధిస్తారు... కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకూడదు.. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. 


 
ఇంకా ఇప్పుడు ఎలాంటి అల్లర్లు హింసాత్మక సంఘటనలు చెలరేగకపోయినప్పటికీ.. కరోనా అనే మూడు అక్షరాల మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ప్రజలను గజగజా వణికించేస్తోంది. అందుకే ఈ కర్ఫ్యూ విధించారు. కరోనా వైరస్ 12 గంటల కంటే ఎక్కువ బతకదు.. అందువల్ల దేశ ప్రజలంతా 14 గంటలు ఇంట్లోనే ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకైనా నివారించవచ్చు అని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 


 
అయితే ఈ కర్ఫ్యూ శిక్ష కాదు.. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించడం కారణంగా ఈ కర్ఫ్యూ విధించారు.. ఇలాంటి కర్ఫ్యూ అప్పట్లో రాజీవ్ గాంధీ మరణించిన సమయంలో ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా కృషి చేయాలి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కర్ఫ్యూను విధించారు. మీ జీవితంలో కేవలం అంటే కేవలం 14 గంటలు ఇంట్లోనే ఉంటే కొంతైనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంది. 


 
మిమ్మల్ని మీరు మాత్రమే కాదు.. మీ పిల్లలను.. మీ పెద్దలను.. మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. కర్ఫ్యూ అనేది శిక్ష కాదు.. ఈ 14 గంటలు ఎవరికి వారు విధించుకోవాలి. అప్పుడే దేశాన్ని కాపాడిన వారు అవుతారు.. కరోనాను తరిమికొట్టినవారు అవుతారు. అందుకే ప్రధాని మోదీ చెప్పినట్టు ఆ 14 గంటలు మన ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా గడుపుదాం.. కరోనాను తరిమికొడదాం.             

మరింత సమాచారం తెలుసుకోండి: