ప్రపంచంలో అతివేగంగా, అన్నీంటికి భిన్నంగా వ్యాపిస్తున్న వైరస్‌గా కరోనా పేరుగాంచింది.. ఇదొక విచిత్రమైన వ్యాధి.. మనిషి శ్వాస వ్యవస్దను నిర్వీర్యం చేసి అతలాకుతం చేస్తుంది.. ఇకపోతే క్లినికల్ రిసెర్చ్ ప్రకారం ఇన్ఫ్లుఎంజాలో మనం చూడగలిగే వ్యాధి వర్గానికి భిన్నమైన వ్యాధిని సూచిస్తుందని, స్పానిష్ ఫ్లూ బాధితులలో వైరస్ వ్యాప్తి గురించి అధ్యయనం చేసిన జెఫరీ కె. టౌబెన్ బెర్గర్ చెబుతున్నారు. ఇతను 20 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ మీద అధ్యయనం చేశారు. ఇక ఈ  కోవిడ్ -19 వైరస్ వ్యాప్తికి, అధికంగా వ్యక్తి దగ్గు, తుమ్ము లేదా శ్వాస నుండి వెలువడిన వైరస్ నిండిన బిందువులు కారణం అవుతాయని తెలుపుతున్నారు..

 

 

ఇదే కాకుండా చైనాలో ఒక స్వచ్చంద మిషన్‌కు సహ నాయకత్వం వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఐల్వర్డ్ 56 వేల కేసులని పరీక్షించిన డేటా ప్రకారం అతి తక్కువ సమయంలోనే అతి వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్నారు.. అయితే ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో 10-15% మంది తేలికపాటి సమస్యలతో ఉండగా, 15-20% అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. కాగా ఎక్కువగా 60 సంవత్సరాల వయస్సు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరణాల బారిన పడుతున్నారు..

 

 

అయితే ఇలా మరణించే వారిలో అధికశాతం మందికి ముందునుంచే బీపీ, డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా వారి మరణానికి ఇవి కూడా కారణాలుగా పేర్కొనబడుతున్నాయి.. ఇకపోతే పూర్తి ఆరోగ్యంగా ఉన్న యూత్ కూడా ఈ వైరస్‌కి బలవుతున్నారు. ఇందుకు ఉదహరణగా లి-వెన్లియాంగ్ ను చెప్పవచ్చు.. ఈ  34 ఏళ్ల కంటి వైద్య నిపుణుడు వుహాన్‌లో ప్రబలుతున్న కరోనా వైరస్ గురించి మొదట హెచ్చరించాడు. అయినా ఇతను ఈ వ్యాధి బారిన పడినప్పుడు యాంటీ బాడీస్, యాంటీ వైరల్స్, యాంటీ బయాటిక్స్, ఆక్సిజన్ తీసుకున్న అతని ప్రాణాలను కాపాడుకోలేక పోయాడు.. ఇతనే గాక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, ముందు నుంచీ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, జన్యుపరంగా వైరస్ బారిన పడడానికి అధిక అవకాశాలు ఉంటాయి..

 

 

ఇక ప్రస్తుతం ఈ వ్యాధి సోకే విధానన్ని పరిశీలిస్తే సాధారణంగా ముక్కులో మొదలవుతుంది. క్రమంగా శరీరం లోపలి శ్వాస కోశ రేఖను రక్షించే ఎపిథీలియల్ కణాలపై దాడి చేస్తుంది.. ఇంతటితో ఆగితే ఫర్వాలేదు కానీ ఊపిరితిత్తులకు చేరితే వ్యాధి తీవ్రత పెరుగుతుందని, నిపుణులు చెబుతున్నారు.. ఇదే కాకుండా ఈ వైరస్ ద్వారా నేరుగా న్యుమోనియా కలగడం మొదటి సమస్య, కాగా రోగ నిరోధక ప్రతిస్పందనలు తగ్గడం మరో సమస్య. అయితే ఆరోగ్యవంతులకు మాత్రం ఈ వ్యాధి సోకదనే ధీమా మాత్రం వద్దు.. కాకపోతే వీరికి సోకినా క్రమ క్రమంగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది.. మొత్తానికి ఎవరికి సోకుతుందా లేదా అని ఆలోచించే బదులు ప్రతి వారు ఈ కరోనా రాకుండా జాగ్రత్తపడటం అవసరం..  

మరింత సమాచారం తెలుసుకోండి: