కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్ని దేశాలు కూడా ఇప్పుడు కరోనా కారణంగా షట్ డౌన్ ని ప్రకటించాయి. మన దేశంలో కరోనా వైరస్ దెబ్బకు చాలా వ్యాపారాలను మూసి వేసారు. అన్ని దేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు కీలక కంపెనీలను మూసి వేసారు. ఐటి కంపెనీల కార్యాకలాపాలు అన్నీ కూడా ఇప్పుడు మూత పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది మన దేశంలో. 

 

ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా నిబంధనలను సడలించే ప్రయత్నాలు చేయడం లేదు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఇప్పుడు మన దేశంలో వ్యాపారాలు అన్నీ మూత పడటమే కాకుండా ప్రజలకు పనులు కూడా దొరికే పరిస్థితి కనపడటం లేదు. సినీ పరిశ్రమ సహా అనేక చోట్ల ప్రజలకు పనులు దొరకడం లేదు అనే చెప్పవచ్చు. అలాగే భవన నిర్మాణాలు, వ్యవసాయ పనులు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల ప్రజలకు ఇప్పుడు పనులు లేక అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్ప కూలిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే పరిస్థితి అదుపులోకి రావడం లేదు. పనులు లేకపోతే ప్రజలకు కొనుగోలు శక్తి అనేది భారీగా పడిపోతుంది. అప్పులు చేస్తూ ఉంటారు. అవి తీర్చడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో ఆర్ధిక వ్యవస్థ చక్కబడే పరిస్థితి కనపడటం లేదు అనే చెప్పవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే కరోనా దెబ్బ ఆర్ధిక సమస్యలను తీవ్రంగా సృష్టించే అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో దీని ప్రభావం గట్టిగా పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనాల భయం కూడా ఇప్పట్లో పోయే అవకాశం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: