చైనాలో ఇటీవ‌ల పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం కత్తిమీద సాములా మారింది. మ‌రియు చైనాలో కంటే ఇప్పుడు ఇటలీలో కరోనా వైరస్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం... చైనాలో కొత్తగా చనిపోయిన వారి సంఖ్య 7గా ఉంటే... ఇటలీలో అది 627గా ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా  రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.. బాధితుల అయితే వేల సంఖ్యల్లోనే ఉన్నారు. 

 

కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌లోనూ క‌ల‌క‌లం రేపుతోంది. దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ క్రమంగా హైదరాబాద్ దాకా విస్తరించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఎంతో మందిని బ‌లితీసుకున్న క‌రోనా వైర‌స్ వ‌ల్ల మంచి జ‌రిగిందంటే న‌మ్ముతారా..? అవును! క‌రోనా వైర‌స్ ఓ మంచి జ‌రిగింది.  

 

కరోనా వైరస్ దెబ్బతో పలు దేశాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో కాలుష్యం స్థాయి గణనీయంగా తగ్గింది. అలాగే సముద్రాల్లో ప్రతిరోజు టన్నుల కొద్దీ వదిలే రసాయనాలు కూడా తగ్గడంతో అందులో జలచరాలు ఎంతో ఆనందంగా ఈత కొడుతున్నాయి. ముఖ్యంగా చైనా వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి భారీగా తగ్గింది. మ‌రియు కరోనా వల్ల ఒక మంచి జరిగింద‌ని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మార్షల్ బుర్కే వెల్ల‌డించారు. 

 

కాలుష్యం కారణంగా సుమారు 50 నుండి 75 వేల మంది మరణం నుంచి త‌ప్పించుకున్నారు. అలాగే  ఈ రెండు నెలల పాటు స్వచ్ఛమైన గాలి అంద‌డంతో ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన సుమారు 4000 మంది చిన్నారులు, 70 ఏళ్లుపైబడిన వయసు కలిగిన 51,000 నుంచి 73,000 మంది పెద్దల ప్రాణాలకు రక్షణ లభించిందని తెలిపారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: