క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. బాయోవార్‌ను ఎదుర్కొంటోంది. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ అన‌తికాలంలోకి దాదాపుగా అన్ని దేశాల‌కు వ్యాపించింది. దీంతో అన్నిదేశాల్లోనూ రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించే అమెరికాలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే నాలుగు రాష్ట్రాలు నిర్బంధంలోకి వెళ్లాయి.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ వ‌ల్ల 230 మంది చ‌నిపోయారు. క‌రోనా సోకిన వారి సంఖ్య 20 వేల‌కు చేరుకున్న‌ది. ఇలా రోజురోజుకూ భ‌యాన‌కంగా మారుతున్న త‌రుణంలో అమెరికాకు మ‌రో పిడుగులాంటి వార్త వ‌చ్చింది. అమెరికా ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ వ‌ద్ద ప‌నిచేసే బృందంలో ఒక‌రికి క‌రోనా వైర‌స్ సోకడంతో క‌ల‌క‌లం రేగుతోంది. ఈ నేప‌థ్యంలో వైట్‌హౌజ్ అప్ర‌మ‌త్త‌మైంది. వైట్‌హౌజ్‌లో ప‌నిచేస్తున్న వారిలో వైర‌స్ సోకిన తొలి ఉద్యోగిగా అత‌న్ని గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన ఉద్యోగితో అధ్య‌క్షుడు ట్రంప్ కానీ, ఉపాధ్య‌క్షుడు పెన్స్ కానీ కాంటాక్ట్‌లోకి రాలేద‌ని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ కేటీ మిల్ల‌ర్ తెలిపారు.  

 

ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌లే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అయితే.. ఆ టెస్టులో క‌రోనా నెగ‌టివ్‌గా తేలిసింది. దీంతో ఊపిరిపీల్చుకున్న ట్రంప్‌కు ఇప్పుడు కొత్త‌చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. ఏకంగా వైట్‌హౌస్ ఉద్యోగికి కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఉద్యోగులు ఉలిక్కిప‌డుతున్నారు. ఏం జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప‌రిస్థితి రోజురోజుకూ భ‌యాన‌కంగా మారుతుండ‌డంతో అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రోసారి చైనాపై ఆగ్ర హం వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్‌తో పొంచి ప్ర‌మాదం గురించి మందే తెలిసినా చైనా ప్ర‌పంచ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌లేదంటూ మండిప‌డ్డారు. చైనా వ‌ల్లే ఈ రోజు ప్ర‌పంచం ప్ర‌మాదంలో ప‌డిపోయింద‌ని అన్నారు. గ‌తంలో కూడా చైనాపై ట్రంప్ మండిప‌డ్డారు. ఇది చైనా వైర‌స్ అంటూ నిందించడంతో ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తీవ్రంగా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.  అలా అన‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: