కరోనా విసృతంగా విస్తరిస్తున్న నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని, భారతదేశ పౌరులు బాధ్యతగల పౌరులని అనిపించుకోవాలి కాని, కొందరు మాత్రం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ.. ఏదో అత్తగారింటికి పేరంటానికి వెళ్లినట్లుగా ప్రవర్తిస్తున్నారట.. ప్రస్తుత పరిస్దితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు.. ఎందుకంటే ఒకరికి మంచిచేసే అవకాశమున్న అది మాత్రం చేయడం తెలియని మనుషులు జీవిస్తున్న కాలంలో పదిమందికి చెడు చేయాలంటే ముందుంటారు.. ఇదిగో ఇప్పుడు ఇలాగే జరుగుతుందట..

 

 

అదేమంటే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినా అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారట. ఇందుకు వారు చెప్పే కారణాలు ఏంటంటే వసతులు లేవని, భోజనం సరిగ్గా లేదని, ఒంటరిగా ఉండలేక పోతున్నామని ఇంటిబాట పడుతున్నారట. ఇదిలా ఉండగా ఇలా అనేక సాకులు చెబుతూ వెళ్లిపోతున్న వారిని ఒప్పించి, వసతులు కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విఫలం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇలా ఏడు క్వారంటైన్‌ కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి ఏకంగా 1,019 మంది వెళ్లిపోగా వారి నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకొని పంపిస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల అధికారులు చెబుతున్నారు..

 

 

అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఇలాంటి విషయంలో మొదట కఠినంగా వ్యవహరించిన ... చివరకు వసతులు కల్పించలేకపోతున్నామన్న భావనతో చేతులెత్తేస్తున్నారన్న ప్రచారం జరుగుతుందట.. అయితే వీరంత అత్యధిక వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చారు, వీరివల్ల జరగరాని నష్టం జరిగెతే ఎలా.. కాబట్టి వారిని క్వారంటైన్‌లో ఉంచకుండా ఇలా పంపించడం పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయట..

 

 

ఇకపోతే ఆయా దేశాల నుంచి వచ్చిన వారిలో వీఐపీలు ఉండటం, సర్కారు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారందరినీ ఇళ్లకు పంపేశారు. ఏది ఏమైనా వీఐపీలకు..స్పెషల్‌గా కరోనా వీఐపీ అని ఉండదుగా.. అందరికి రోగం ఒకటే, మరి ఇలాంటప్పుడు బాధ్యతగల వృత్తిలో ఉండి ఇలా ప్రవర్తించడం సమంజసం కాదంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: