ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు 7 ఖండాలకు కరోనా వైరస్ సోకింది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని అర్ధమవుతుంది. యూరప్ దేశాల్లో ఇప్పటి వరకు ఆరు వేల మంది వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రెండు లక్షల 75 వేల మందికి కరోనా సోకింది. ఇటలీలో కరోనా రెచ్చిపోతుంది. 627 మంది ఒక్క శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. 

 

స్పెయిన్ లో 1,033 మంది, ఇరాన్ లో 1400 మంది కరోనా కారణంగా మరణించారు. ఇటలీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా దాదాపు 4500 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇటలీ ప్రభుత్వం, ఫ్రాన్స్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ అనేది కట్టడి కావడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. ఇక మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య... 255 మందికి చేరింది. అమెరికా వైట్ హౌస్ లో కూడా కరోనా వైరస్ సోకింది. 

 

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో పని చేసే వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇక అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని కట్టడి చేయడం కోసం వైరస్ ని కనుగునే పనిలో అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంలో ఒక్క విజయవంతమైన ముందు అడుగు కూడా పడలేదు. ఎప్పుడు కనుక్కుంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటలీ, సహా యూరప్ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు కరోనా కారణంగా భయం గుప్పిట్లో ఉన్నాయి. అమెరికాలో కూడా కరోనా కేసుల సంఖ్య బారీగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: