తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ ను కమ్మ కులానికి చెందిన అధికారులతో టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ పై కమ్మ కులానికి చెందిన మరో అధికారి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి తనకు వైసీపీ చేస్తున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. 
 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తనను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించిందని... రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి తన విషయంలో కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీలో తన అనుమతి లేకుండానే నిర్ణయాల అమలు జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్రటరీనే తాను తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంటున్నాడని... అతని ద్వారానే నిర్ణయాల అమలు జరుగుతుందని చెప్పారు. 
 
తాను గత ఆరునెలలుగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని ... గవర్నర్ జోక్యం చేసుకొని తన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం గవర్నర్ రంగరాజన్ ను ఇంఛార్జీగా నియమించడంతో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పేజీల లేఖతో ఉదయభాస్కర్ సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. 
 
మూడు రోజుల క్రితం ఇదే కులానికి చెందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కేంద్ర హోం శాఖకు లేఖ రాసి జగన్ ను టార్గెట్ చేశారు. ఈ లేఖ వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఉదయభాస్కర్ గవర్నర్ ను కలవడానికి చంద్రబాబే కారణమని తెలుస్తోంది. చంద్రబాబు జగన్ ను కమ్మోళ్లతో టార్గెట్ చేస్తున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏపీలో కుల రాజకీయాలకు తెర లేపుతున్నాడని... రాష్ట్రంలో ఈ కులాల రొచ్చు ఏంటని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: