నెట్టింటి లో మోసాలకు అంతు లేకుండా పోతోంది. ఎన్ని కేసులు వస్తున్న, ఎన్నో ముఠాలు దొరుకుతున్న అడ్డు, అదుపు లేకుండా పోతోంది ఈ మోసాలకు. కానీ ఈ పాటికే ప్రజలలో అవగాహన చాలా రావడంతో ఎక్కువ శాతం జనం ఏమి మోసపోవడం లేదు. అయితే ఇటువంటి కేసులు ఎన్నో వచ్చాయి కానీ వీటికి ఫుల్స్టాప్ మాత్రం అవ్వడం లేదు.

 

తాజాగా మరో కేసు వెలుగు లోకి వచ్చింది. ఏకముగా రూ 3.17 లక్షలు దోచేసుకున్నారు. కొత్త తరహా మోసాలతో ఈ సైబర్ నేరగాళ్లు భారీ ప్లాన్ తో డబ్బులు గుంజుతున్నారు. ఓఎల్ ఎక్స్ లో ఆర్మీ   ప్రొఫయిల్ లో ఈ వాహనాల్ని అమ్మకానికి పెట్టి మోసాలు చేస్తున్నారు. నిజంగా ఘోరాతి ఘోరం. అంతు లేకుండా వీళ్ళు నేరాలు చేస్తున్నారు. ఆర్మీ ప్రొఫైల్ లో వాహనాలు పెట్టి లక్షలు లక్షలు తమ ఖాతా లో వేసుకుంటున్నారు. అయితే ఆర్మీ వాహనాలకు క్రేజ్ ఎక్కువ. త్వరగా యువత వీటికి ఆకర్షితులు అవుతున్నారు. 

 

నేరాలకు హద్దు లేకుండా పోతోంది. అయితే మొదట చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు బైక్ కొందాం అని ఓఎల్ ఎక్స్ లో వెతికాడు. అక్కడ ఆర్మీ ప్రొఫైల్ లో బైక్ అమ్మకానికి కనిపించింది. అది కూడా రాయల్ ఎంఫీల్డ్ కావడంతో కొందాం అని రేటు చూసాడు. రూ 65 వేలు ఉండడం తో కొనుగోలు  చెయ్యాలని భావించి ఫోన్ చేసి రేటు మాట్లాడుకున్నారు. రూ. 5100 చెల్లించాలని చెప్పాడు ఆ మోసగాడు.

 

 

మిగిన మొత్తాన్ని కూడా చెల్లించాలన్నారు కానీ రూ 2100 మాత్రమే పంపాడు.  కాదు మొత్తం పంపమంటే మిగిలిన దానిని కూడా పంపాడు కానీ మళ్ళీ పంపమనే సరికి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేసాడు. ఇలా వేరు వేరుగా ముగ్గురు బాధితులు కేసు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: