కరోనా పదమే పదే వినిపిస్తోంది. ప్రపంచమంతటిని గజగజలాడిస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది ఈ వైరస్. నిజంగా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బాధిస్తోంది ఈ మహమ్మారి. ఖండాలు దాటి, దేశాలు దాటి అందర్నీ హింసిస్తోంది. అయితే ఇంత వరుకు కూడా దీనికి మందు రాలేదు. కానీ అనేక జాగ్రత్తలు,  పలు చర్యలు పాటిస్తే కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్పారు.

 

అలానే పదే సోప్ తో కానీ శానిటైజర్ తో కానీ చేతులని శుభ్రం చేసుకుంటూ ఉండాలని కూడా అన్నారు. అయితే ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ మహమ్మారిని కంట్రోల్ చెయ్యచ్చని అన్నారు. అయితే వీటిని సెలబ్రెటీస్ సైతం మంచి టిప్స్ చెబుతూ జనానికి అవగాహన అందిస్తున్నారు.

 

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ దీపికా , మాస్టర్ సచిన్ ఇలా అనేక మంది కరోనా గురించి జాగ్రత్తలు చెప్పుకొస్తున్నారు . మరి ఈ విరుష్క కపుల్ కరోనా గురించి చెప్పుకొస్తున్నారు. ఈ కరోనా కి ఇంత వరకు మందు రాలేదు కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నారు . అలానే దేశ ప్రజల హితం కోసం 22 న జరగనున్న జనతా కర్ఫ్యూ ని విజయం చెయ్యాలి.

 

మన హితం కోసం మనం పాటించాలి అని విరాట్, అనుష్క చెప్పారు. ప్రధాని మోదీ ఎనౌన్స్ చేసిన ఈ జనతా కర్ఫ్యూ తప్పక పాటించడం మన బాధ్యత అని వారిద్దరూ అన్నారు. కరోనా సోక కుండా ఉండాలంటే కలిసిగట్టుగా కృషి చెయ్యాలి అని వారిద్దరూ చెప్పారు. ప్రధాని ఇచ్చిన సూచనలని పాటిద్దాం అని వారు చెప్పారు. అలానే సచిన్ కూడా శుభ్రత ముఖ్యం అని అన్నారు. కేవలం మనం మాత్రం కాక చుట్టూ ఉన్న పరిశ్రమలు కూడా శుభ్రంగా ఉంచాలని మాస్టర్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: