ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రబల కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ఆగ్రాలో ఏడుగురికి, ఘజియాబాద్‌లో ఇద్దరికి, నోయిడా, లక్నోలో ఒక్కొక్కరికి కరోనా వ్యాధి సోకినట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీలు, టెక్నికల్‌, వొకేషనల్‌ విద్యాసంస్థలకు ఈ నెల 22 వరకు సెలవులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.   కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

 

 కరోనా వైరస్ రోగులను దాచటానికి ప్రయత్నించినా, సమాజంలో భయందోళనలు కలిగించేలా వదంతులను వ్యాప్తి చేసినా, అలాంటి వారికి జైలు శిక్ష విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాదు  కరోనా లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించినా, ఆసుపత్రుల నుంచి పారిపోయినా, వైద్యుల బృందం తన విధిని నిర్వహించకుండా అడ్డుకున్న వారిని అంటువ్యాధుల చట్టం సెక్షన్ 3 ప్రకారం జైలుకు పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు.

 

తాజాగా  కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీలో రాష్ట్ర మంత్రులందరూ ఇంటి నుంచే పనిచేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.   మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో... ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే కరోనా వైరస్  200 కేసులకు పైగా నమోదు అయ్యాయి.. ఐదుగురు మృతి చెందారు.  ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తగిన సూచనలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: