క‌రోనా వైర‌స్‌ను క‌ట్టడి చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది. వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని ర‌కాల‌ చ‌ర్య‌లు తీ సుకుంటున్న‌ది. ప్రస్తుత త‌రుణంలో కరోనా వైరస్‌ను బలంగా ఎదుర్కోవాలంటే... కరెంటు సరఫరా త‌ప్ప‌నిస‌ర‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ఈమేర‌కు ప్ర‌తి రోజూ 24 గంటలూ కరెంటు సప్లై ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ది.  అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప‌వ‌ర్ స‌ప్లై పూర్తి స్థాయిలో జరగాలని సంబంధిత అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈమేర‌కు తెలంగాణలో కరోనా వైరస్ టెన్షన్స్ ఉన్నా... కరెంటు సప్లై విషయంలో మాత్రం అన్ని పవర్ యుటిలిటీస్ సంపూర్ణంగా పని చేసేలా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్, ఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కరెంటు పోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని జోనల్, సర్కిల్ అధికారులను ఆయన ఆదేశించారు. 

 

ప్రస్తుతం కరోనా వైరస్‌ను బలంగా ఎదుర్కోవాలంటే... కరెంటు సరఫరా పూర్తి స్థాయిలో జరగాలని సీఎండీ అభిప్రాయప‌డ్డారు. ఇందుకోసం  రోజూ 24 గంటలూ కరెంటు సప్లై ఉండేలా చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకి సంబంధించి తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (TSLDC), తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ సెంటర్ (SECC) ప్రస్తుతం కరెంటు సప్లైపై దృష్టి పెట్టాయి. హైడల్, థెర్మల్ ప్లాంట్స్ చక్కగా పనిచేసేలా చేస్తున్నాయి. అన్ని పవర్ జ నరేటింగ్ స్టేషన్ల దగ్గరా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసి... కరెంటు కోతలు లేకుండా చేస్తున్నాయి.  వచ్చే 15 రోజుల వరకూ కరెంటు సప్లైలో ఎలాంటి కోతలూ ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఐటీ ఉద్యోగులతోపాటూ... చాలా మంది వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నవారు... వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. వీళ్లందరికీ కరెంటు సప్లై తప్పనిసరి. ఆఫీసుల్లో కరెంటు పోతే... జనరేటర్ ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు. అదే ఇళ్లలో కరెంటు పోతే... ఉద్యోగులు ఇబ్బంది పడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని... 24 గంట‌లూ కోత‌లు లేకుండా సంపూర్ణంగా కరెంటు స‌ర‌ఫ‌రా చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధ‌మ‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: