ఒక మనిషి ఎదగాలి అంటే మానవ సంబంధాల విషయంలో అతడికి ఉన్న అవగాహన పై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే మానవ సంబంధాలను సమర్థవంతంగా కొనసాగించుకోగలుగుతారో వారే విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ మానవ సంబంధాలు నాలుగు రకాలుగా ఉంటాయి.


ఒకరితో ఒకరు అవసరం ఉండి కల్పించుకున్న సంబంధం దానినే అవసరం అని అంటారు. సంగీతం సాహిత్యం అభిరుచుల వల్ల ఏర్పడిన మరొక మానవ సంబంధాన్ని అభిరుచి అని అంటారు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే ఆకర్షణ వల్ల కలిగే స్నేహాన్ని ఆకర్షణ అని అంటారు. వీటన్నిటితో సంబంధం లేకుండా ఒంటరి తనం అనే స్నేహ బంధాన్ని మనకు తెలియకుండానేమనలను వెంటాడుతూ ఉంటుంది దానినే ఐడెంటిటీ క్రైసిస్ అని అంటారు.


ఈ నాలుగు రకాల మానవ సంబంధాలు వల్ల మనకు స్నేహితులు ఏర్పడతారు. ఆ స్నేహితులు వలెనే మనిషి వ్యక్తిత్వం మెరుగుపడి తన లక్ష్యం చేరుకునే విషయంలో సహాయపడుతూ ఉంటుంది. అయితే స్నేహం పట్ల ప్రతి వ్యక్తికి ఒకొక్క అభిప్రాయం ఉంటుంది. చాలామంది అవసరం అనుకుంటే మాత్రమే స్నేహితుడుతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి స్నేహం సరైన మానవ సంబంధాలను క్రియేట్ చేయలేదు.


అలాగే చాలామంది బంధువులు అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి బంధుత్వాలు సరైన మానవ సంబంధాలను సృష్టించలేవు. అందువల్లనే ఈరోజు ప్రతి వ్యక్తి నలుగురి మధ్య జీవిస్తూ ఉన్నా సరైన మానవ సంబంధాలు లేకపోవడంతో ఏకాకిగా జీవించవలసి వస్తోంది. చాలామంది జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాక బాగా సంపాదన సంపాదించిన తరువాత మానవ సంబంధాల గురించి ఆలోచిద్దాం అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు చేసేవారిలో నెగిటివ్ ట్రెండ్ పెరిగిపోయి తమ జీవితాన్ని నిర్మించుకునే విషయంలో ప్రతి విషయంలోను పొరపాట్లు చేస్తూనే ఉంటారు. సమాజంలో జీవిస్తున్నందుకు ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి పై ఏదోఒక సందర్భంలో ఆధారపడటమే మానవ సంబంధం. ఈ మానవ సంబంధాలు సక్రమంగా నిలబెట్టుకునే వ్యక్తిదగ్గర మాత్రమే ఐశ్వర్యం లభిస్తుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: