ఏపి ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  హైదరాబాద్ లో ఎన్ని రోజులు కూర్చుంటాడు ?  స్దానిక సంస్దల ఎన్నికల వాయిదా వేసిన తర్వాత సుప్రింకోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ విజయవాడ నుండి వచ్చేసి హైదరాబాద్ లో కూర్చున్నాడు. తన మొబైల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేయటం మరీ విచిత్రంగా ఉంది. కేంద్ర హోంశాఖకు తాను రాసినట్లుగా చెలామణిలో ఉన్న లేఖ పై రాష్ట్రంలో ఎంత రాద్దాంతం జరుగుతోందో అందరూ చూస్తున్నదే. ఇంత గోల జరుగుతుంటే నిమ్మగడ్డ తనకేమీ పట్టనట్లుగా వచ్చి హైదరాబాద్ లో కూర్చోవటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. బహుశా చంద్రబాబు కూడా ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. బహుశా వాళ్ళిద్దరి మధ్య ఇక్కడేమైనా భేటి జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ నిమ్మగడ్డ వల్ల ఎంత స్ధాయిలో గబ్బు పట్టిపోయిందో అందరూ చూసిందే.  ఎన్నికల్లో తమను నేరుగా ఎదుర్కోలేక  నిమ్మగడ్డను మ్యానేజ్ చేసుకుని ఎన్నికలను చంద్రబాబు ఏకపక్షంగా వాయిదా వేయించుకున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాయించేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. సరే వైసిపి ఆరోపణలను చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఖండిస్తున్నారు అనుకోండి అది వేరే సంగతి. రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలే.

 

సరే ఈ ఆరోపణల్లో నిజమెంత ? అబద్ధమెంత ? అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల వాయిదాపై జగన్ సర్కార్ సుప్రింకోర్టుకు వెళ్ళింది. ఎన్నికల వాయిదా విషయంలో జోక్యం చేసుకోమని చెప్పిన కోర్టు ఎన్నికల వాయిదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం లాంటి అంశాలపై నిమ్మగడ్డకు బాగా అక్షింతలు వేసింది. ఇది జరిగిన ఓ రెండు గంటల వ్యవధిలోనే నిమ్మగడ్డ రాసినట్లుగా ఓ లేఖ వెలుగు చూసింది.

 

ఆ లేఖను తాను రాయలేదని ఓ వార్తా సంస్ధకు చెప్పాడు. మరి అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పటం లేదు ? ఒకవైపు లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డే చెబుతుంటే కాదు నిమ్మగడ్డే రాశాడని చంద్రబాబు అండ్ కో అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు ?  సరే వీళ్ళ విషయాన్ని పక్కనపెడితే నిమ్మగడ్డ విజయవాడ నుండి వచ్చేసి హైదరాబాద్ లో కూర్చోవటమేంటి ?  ఎన్నికలు వాయిదా వేసినంత మాత్రాన వచ్చి హైదరాబాద్ లో కూర్చోవటమేనా ? ఎన్ని రోజులు కూర్చుంటాడు ? అన్నదే ఇపుడు చర్చనీయాంశమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: