ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  భయంతో ఊగిపోతున్న విషయం తెలిసిందే. చైనా దేశంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తు ప్రాణ  భయాన్ని కలిగిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు మొత్తం చిగురుటాకులా వణికిపోతున్నాయి , ప్రస్తుతం ఏదేశంలో చూసినా కరోనా వైరస్ మాట వినిపిస్తోంది.ఎవరిలో  చూసినా కరోనా వైరస్ భయమే  కనిపిస్తుంది. ఈ మహమ్మారి శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇలా రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నా వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్ చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇటలీ ఇరాన్ లాంటి దేశాల్లో మాత్రం మరణ మృదంగం మోగిస్తోంది అనే చెప్పాలి. 

 

 ఇక ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఉంది కరోనా వైరస్.
 దీంతో ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ ను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్  పై పోరాటం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ మొత్తం మొత్తం కరోనా  వైరస్ పై  ఆందోళన చెందుతూ పోరాటం చేస్తుంటే ఉత్తర కొరియా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈరోజు ఉత్తర కొరియా దేశంలో రెండు మిసైళ్లను  పరీక్షించింది అనే దక్షిణ కొరియా మిలిటరీ విభాగం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యంగ్ ప్రావిన్స్ నుంచి... తూర్పు దిశగా పరీక్షించిన క్షిపణులు వెళ్లాయి  అంటూ తెలిపింది దక్షిణ కొరియా మిలిటరీ. 

 


 అయితే ఈ క్షిపణులు ఏకంగా 410 కిలోమీటర్ల దూరం... 50 మీటర్ల ఎత్తులో నుంచి వెళ్లాలి అంటూ సమాచారం. అయితే కొన్ని రోజుల క్రితం ఫైరింగ్ డ్రిల్  లో భాగంగా కుడా... ఉత్తర కొరియా కొన్ని మిస్సైల్స్ ని  పరీక్షించిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుండి ప్రపంచ దేశాలు మొత్తం కరోనా  వైరస్ వ్యాప్తి తో బాధపడుతూ ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతు .. టెన్షన్ టెన్షన్ గా గడుపుతూ ఉంటే... మరోవైపు ఉత్తర కొరియా మాత్రం ఇటువంటి పరీక్షలు చేయడం శోచనీయం అంటూ దక్షిణకొరియా వ్యాఖ్యానించింది. ఏదేమైనా ఉత్తర కొరియా తీరు మాత్రం ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: